Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Maternity - Paternity - Hysterectomy Leave

ప్రసూతి సెలవు (మెటర్నిటీ లీవ్)

ఉద్యోగం చేసే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రత్యేకమైన రాయితీలను, అవకాశాలను కల్పించింది. వారికి గృహ సంబంధ బాధ్యతల నిర్వహణకు అధనంగా, శరీర నిర్మాణ పరంగా తలెత్తే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా ఉండవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కల్పించిన సదుపాయాలలో ముఖ్యమైనది ప్రసూతి సెలవు. 

ప్రసూతి సెలవు 180 రోజుల వరకు లభిస్తుంది, మిస్ క్యారేజ్ (అబార్షన్) కు 6 వారాల సెలవు లభిస్తుంది. అయితే ఇద్దరు లేదా అంతకన్నా తక్కువ సంఖ్యలో జీవించి ఉన్న పిల్లల వరకే ఈ సదుపాయం పరిమితం. (జి.ఓ.యం.యస్.నం. 152 Fin & Plg. Dept తేదీ. 04-05-2010. 

  • ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించే వైద్య ధ్రువపత్రంలో తప్పనిసరిగా 
  • అది ఎన్నో కాన్పో స్పష్టముగా పేర్కొనాలి. అంతే కాకుండా కాన్పుసంఖ్య ఏదైనా, ఈకాన్పులో ప్రసవించిన బిడ్డతో కలిపి, ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారని వైద్య ధ్రువపత్రంలో ఉండి ప్రసవించిన బిడ్డతో కల్పి, ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారని వైద్య ధ్రువపత్రంలో ఉండాలి. 
  • వైద్య ధ్రువపత్రములో కాన్పు అయినా తేదీని తెలపాలి. ఈ సెలవు కాన్పు అయిన తేదీనుండి ప్రసూతి సెలవు మంజూరుకు అవకాశం ఉంది.
  • మంజూరైన ప్రసూతి సెలవు మొత్తం 180 రోజులకు పూర్తి జీతం లభిస్తుంది. సెలవు మంజూరు చేయించుకున్న పక్షంలో ప్రసూతి సెలవు తీసుకున్న ఉద్యోగికి ప్రతి నెలా జీతం పొందే హక్కు ఉంది. 
  • ఏ కారణం వల్లనైనా 180 రోజులకు మించి సెలవు కావలసిన పక్షంలో 180 రోజులకు ప్రసూతి సెలవు పోగా, మిగిలిన రోజులకు తమకు అర్హత ఉన్న లీవ్ ను మంజూరు చేయించుకోవచ్చు. 
  • ప్రసూతి సెలవును ఉద్యోగి లీవ్ ఖాతాలో మినహాయించనవసరం లేదు. 
  • విద్యా సంవత్సరం పనిదినాలలో ప్రసూతి సెలవు తీసుకునేట్లయితే పూర్తి సెలవు దినాలలో ప్రసూతి సెలవుగానే పరిగణిస్తారు. 
  • వెకేషన్ లో ప్రసూతి అయినచో ప్రసూతి అయిన తేదీ నుండి 180 రోజుల మెటర్నిటీ సెలవు మంజూరి చేయాలి. (జి.ఓ.యం.ఎస్. నం. 562 తేదీ 23.06.1981)
  • ప్రసూతి సెలవులో ఉన్నపుడు పదోన్నతి లభిస్తే ప్రసూతి సెలవులు పూర్తయిన తరువాత విధులలో చేరాలి. (సి&డి.ఎస్.ఇ ప్రొసీడింగ్స్ నం. 29/C3-4/2003 తేదీ 25-01-2003)
  • సజీవంగా ఉన్న బిడ్డలు ఇద్దరు ఉన్న పక్షంలో, ఆ ఉద్యోగినికి ఆ తరువాత ప్రసూతి సెలవు, మిస్ క్యారేజ్ (అబార్షన్) లపై సెలవు లభించదు. ప్రసూతి సెలవు అనేది ఇద్దరు సజీవంగా ఉన్న బిడ్డల వరకే లభిస్తుంది. 

పితృత్వ సెలవులు 

పే రెవిజన్ కమీషన్ చైర్మన్ గారికి పి.ఆర్.టి.యు తరపున ప్రాతినిధ్యము చేసి భార్య ప్రసూతి చెందినపుడు  వారికి సేవ చేయుటకు గాను భర్తకు 15 రోజుల పాటర్నిటీ సెలవులు మంజూరు చేయాలని ప్రతినిత్యం చేయగా పే రివిజన్ కమీషనర్ గారు ప్రభుత్వానికి సిపారసు చేసినారు ప్రభుత్వము దానికి సమ్మతించి భార్య ప్రసూతి అయినచో వారికి సేవ చేయుటకు ఆమె భర్తకు 15 రోజుల వరకు పితృత్వ సెలవులు మంజూరి చేసినది (G.O.Ms.No. 231 dt. 16.09.2005) కానీ ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకే సౌకర్యం వర్తించును. ఈ సెలవును డెలివరి తేదికి 15 రోజుల ముందు లేదా డెలివరీ అయిన తేది నుండి 6 నెలల లోపల అవసరాన్ని బట్టి వాడుకొనవచ్చును. (Govt. memo No. 20129-C/454/FR/2010 Dt. 27.07.2010)

హిస్ట్రె క్టమీ (గర్భసంచి) ఆపరేషన్ సెలవులు 

గర్భసంచి సమస్యలతో భాధపడుచున్న మహిళా ఉద్యోగినులు గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో 45 రోజులు వరకు పూర్తి వేతనంతో కూడుకున్న ప్రత్యేక సెలవులు లభిస్తాయి. ఈ సెలవులను ఏ లీవ్ అకౌంట్ నుండి తీయరు. (G.O.Ms.No 52 Fin Dept Dt. 01.04.2011) 

అప్రెంటిస్ టీచర్లకు రెగ్యులర్ ఉపాధ్యాయులకు లభించే అన్ని రకాల సెలవులు లభించును. 
అప్రెంటిస్ టీచర్లకు రెగ్యులర్ ఉపాధ్యాయులకు లభించే అన్ని రకాల సెలవులు అనగా ఆకస్మిక సెలవులు ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఆర్జిత సెలవులు, అర్ధవేతన సెలవులు, వేతనం లేని సెలవులు, ప్రసూతి సెలవులు హిస్ట్రెక్టమీ సెలవులు, పితృత్వ సెలవులు మొదలగునవి అన్ని లభించును. (G.O.Ms.No 134 Edn Ser V Dept 10.06.1996)