Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Casual Leave (ఆకస్మిక సెలవులు)

ఆకస్మిక సెలవులు : 

వెకేషన్ డిపార్ట్మెంట్ (వేసవి సెలవులు వాడుకొను డిపార్ట్మెంట్) లో పనిచేయు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొన్ని రకముల సెలవులు వేరుగా ఉంటాయి. 
  1. ఒక క్యాలెండరు సంవత్సరమునకు (అనగా 1 జనవరి నుండి 31వ డిసెంబర్ వరకు) 15 రోజుల ఆకస్మిక సెలవులు వాడుకొనవచ్చును. (జి.ఓ.యం.ఎస్. నం. 52 తేది 04-02-1981) 
  2. ఒక క్యాలెండరు సంవత్సరంలో 7 రోజుల వరకు ప్రత్యేక ఆకస్మిక సెలవులు వాడుకొనవచ్చును (జి.ఓ.యం.ఎస్. నం. 47 తేది 19-02-1965) ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవులు పాఠశాలలో పనిచేయు బోధనేతర సిబ్బంది కూడా వాడుకొనవచ్చును. (డి.ఎస్.ఇ. ప్రో. ఆర్.సి. నం. 242-ఆర్3/63-15 తేది 18-11-1965)
  3. పై సీఎల్స్ మరియు స్పెషల్ సిఎల్స్ కాకుండా పిఆర్టీయు ప్రాతినిధ్యము మేరకు మహిళా ఉపాధ్యాయులకు 5 రోజులు అదనంగా ఆకస్మిక సెలవులు వాడుకొనుటకు ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. (జి.ఓ.యం.ఎస్. నం. 374 తేది 16-03-1996) 
  4. తాత్కాలిక ఉపాధ్యాయులు వారు డ్యూటీ చేసిన కాలమునకు లెక్కించి సిఎల్స్ అనగా సంవత్సర కాలములో 6 మాసాల డ్యూటీ మాత్రమే చేస్తే ఏడున్నర రోజులు సిఎల్స్ మరియు మూడున్నర రోజుల స్పెషల్ సిఎల్స్  ఇవ్వాలి. 
  5. ఆకస్మిక సెలవులు, ఆదివారములు, ప్రభుత్వసేలవులు అన్ని కలిపి 10 రోజులకు మించరాదు. అలా మించినచో అతడు కోరిన (Other than CLs) ఆకస్మికేతర సిఎల్ గా పరిగణించి అర్హత గల కోరిన సెలవును మంజూరి చేయాలి. 
  6. ఆకస్మిక సెలవులను వేసవి సెలవులకు, జాయినింగ్ కాలమునకు 10 రోజులు మించిన టర్మ్ హాలిడేస్ లకు కలిపి తీసుకొనరాదు. 
  7. వినతి పత్రము లేనిది ఆకస్మిక సెలవు మంజూరి చేయరాదు. 
  8. ఆకస్మిక సెలవును సగము రోజుగా కూడా వాడుకొనవచ్చును. 
  9. ఆక సెలవును పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు తన పరిధిలోని ఉపాధ్యాయులకు, మండల విద్యాధికారిగారు తన పరిధిలోని ప్రాధానోపాధ్యాయుడు తన పరిధిలోని ఉపాధ్యాయులకు ఉపవిద్యాధికారి గారు తన పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మంజూరి చేస్తారు. 
  10. ప్రతి పాఠశాలలో సిఎల్ అకౌంట్ రిజిస్టర్ నిర్వహించాలి. 
  11. ఒక నెలలో (3) రోజుల వరకు ఆలస్యముగా వచ్చినచో ఒక రోజు సిఎల్ గా పరిగణించాలన్న నిబంధన ఉపాధ్యాయులకు వర్తించదు. ప్రతి ఉపాధ్యాయుడు/ ప్రధానోపాధ్యాయుడు విధిగా ప్రార్థన సమయంలో హాజరు కానివారు 1/2 రోజుకు ఆకస్మిక సెలవుకై వినతి పత్రము సమర్పించి డ్యూటీ చేయాలి. 

0 comments: