Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Leaves-Type of Leaves-General Principles

Leave :

సెలవు అనగా ఉద్యోగి/ఉపాధ్యాయులకు తన విధులకు సంబంధిత అధికారి/ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకుని హాజరు కాకుండా ఉన్నటువంటి కాలాన్ని సెలవు అంటారు. సెలవు వినియోగించుకోవాలి అంటే సెలవు మంజూరు చేయు అధికారంగల అధికారికి/ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాలి, సెలవులో వెళ్ళుటకు గల కారణాలు, ఏవిధమైన సెలవు కావాలి, ఎన్నిరోజులు కావాలి, ఒకవేళ అనారోగ్య పరిస్థితులలో సెలవుపై వెళ్ళినప్పుడు మెడికల్ సర్టిఫికెట్ జతపరచాలి. సెలవులో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటామో అడ్రస్ సెలవు పత్రములో నమోదు చేయాలి. 

F.R 67 ప్రకారం ఉద్యోగికి/ఉపాధ్యాయులకు సెలవు అనేది హక్కుగా భావించరాదు, కానీ సెలవు మంజూరు చేయు అధికారి సర్వసాధారణంగా ఉద్యోగి/ఉపాధ్యాయులకు కోరిన సెలవును నిరాకరించరాదు. పాఠశాల అవసరాల అసాధారణ పరిస్థితులలో కారణాలను రికార్డ్ చేసి ఉద్యోగి/ఉపాధ్యాయులకు కోరిన సెలవును నిరాకరించవచ్చు. 

ఉద్యోగి/ఉపాధ్యాయులకు ఏరకమైన సెలవు కావాలని కోరుకుంటారో అర్హత గల అలాంటి సెలవును మాత్రమే మంజూరు చేయాలి కానీ వారు అర్ధజీతం కావాలని కోరుకుంటే అతని కోరికని కాదని సంపాదిత సెలవు మంజూరు చేయడం నియమాలకు విరుద్ధం.             

Type of Leaves :

  • సాధారణ సెలవు (Casual Leave)
  • ప్రత్యేక సాధారణ సెలవు (Special Casual Leave)  
  • అర్ధజీతం సెలవు (Half Pay Leave)
  • కమ్యుటేడ్ సెలవు (Commuted Leave)
  • ఆర్జిత సెలవు (Earned Leave)
  • ప్రసూతి సెలవు (Maternity Leave)
  • పితృత్వ సెలవు (Paternity Leave) 
  • భయంకర వ్యాధులు సెలవు (Dread Diseases)  
  • అధ్యాయన సెలవు (Study Leave)
  • ఆసుపత్రి సెలవు (Hospital Leave)  
  • ప్రత్యేక అశక్తత సెలవు (Special Disability Leave) 
  • సంపాదించని సెలవు (Leave not Due)
  • అసాధారణ సెలవు (Extra Ordinary Leave)

Duty :

ఉద్యోగులు సెలవులలో ఉన్నప్పటికీ, లేదా ఇతర విధులు నిర్వహిస్తున్న కూడా విధుల్లో ఉన్నట్లుగానే పరిగణలోకి వస్తుంది అవి.

  • పబ్లిక్ హాలిడేస్ లలో, వెకేషన్ కాలములో మరియు ఆకస్మిక సెలవులలో (CL/SpCL)  విధులకు హాజరు కాకుండా ఉండడం. 
  • ఒకవేళ సెలవులలో వెళ్ళడానికి ముందు వచ్చిన లేదా సెలవు తరువాత వచ్చిన పబ్లిక్ హాలిడేస్ లను ప్రీఫిక్స్ /సఫిక్స్ చేసిన రోజులు మరియు అనుమతించిన సెలవు కాలాన్ని (రూల్ 4 (a) ప్రకారం)
  • Foreign Service లో పనిచేసిన కాలాన్ని 
  • సెలవు అనంతరం జాయినింగ్ కాలము    

Service : 

విధులలో ఉన్న రోజులు, అన్ని రకముల సెలవులు, EOL తో సహా సర్వీస్ గా పరిగణిస్తారు.  

  • రూల్ 4A  ప్రకారం ఆర్జిత సెలవు (EL) విధులలో ఉన్న కాలాన్ని పరిగణలోనికి తీసుకుని లెక్కిస్తారు.
  • రూల్ 13 (a) మరియు 18 (a) ప్రకారం సర్వీస్ లో పూర్తి అయిన సంవత్సరాల ఆధారంగా HPL అర్ద వేతన సెలవులను లెక్కిస్తారు.

Pay :

ఉద్యోగికి ప్రతినెల పొందే జీతభత్యములను అన్నిటిని కలిపి Pay అంటారు. రూల్ 4(d)(1) ప్రకారం సెలవులో వెళ్ళుటకు ముందు స్థిరమైన జీతం ఇతర భత్యాలు ఏవైతే ఉన్నాయో వాటినే సెలవు జీతం ఇవ్వవలసి ఉంటుంది.

సాధారణ ఆకస్మిక సెలవు (Casual Leave) Under FR 85

వెకేషన్ డిపార్ట్మెంట్ (వేసవి సెలవులు వాడుకొను డిపార్ట్మెంట్) లో పనిచేయు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొన్ని రకముల సెలవులు వేరుగా ఉంటాయి.  ఈ సెలవు G.O Ms.No. 52 Dt. 04-02-1981 ప్రకారం ఒక క్యాలెండర్ సంవత్సరంలో (జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు) 15రోజుల గరిష్ట పరిమితికి లోబడి అనుమతిస్తారు. 
  • ఆదివారాలు, ఇతర ప్రభుత్వ సెలవు రోజులు, ఐచ్చిక సెలవుదినాలు అన్ని కలిపి 10 రోజుల వరకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 
  • ఒక క్యాలెండరు సంవత్సరమునకు (అనగా 1 జనవరి నుండి 31వ డిసెంబర్ వరకు) 15 రోజుల ఆకస్మిక సెలవులు వాడుకొనవచ్చును. (జి.ఓ.యం.ఎస్. నం. 52 తేది 04-02-1981) 
  • ఒక క్యాలెండరు సంవత్సరంలో 7 రోజుల వరకు ప్రత్యేక ఆకస్మిక సెలవులు వాడుకొనవచ్చును (జి.ఓ.యం.ఎస్. నం. 47 తేది 19-02-1965) ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవులు పాఠశాలలో పనిచేయు బోధనేతర సిబ్బంది కూడా వాడుకొనవచ్చును. (డి.ఎస్.ఇ. ప్రో. ఆర్.సి. నం. 242-ఆర్3/63-15 తేది 18-11-1965)
  • పై సీఎల్స్ మరియు స్పెషల్ సిఎల్స్ కాకుండా PRTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో మన ప్రాతినిత్యం మేరకు మహిళా ఉపాధ్యాయులకు 5 రోజులు అదనంగా ఆకస్మిక సెలవులు వాడుకొనుటకు ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. (జి.ఓ.యం.ఎస్. నం. 374 తేది 16-03-1996) (ఇతర ఉద్యోగినిలకు ఈ సౌకర్యం లేదు). 
  • తాత్కాలిక ఉపాధ్యాయులు వారు డ్యూటీ చేసిన కాలమునకు లెక్కించి సిఎల్స్ అనగా సంవత్సర కాలములో 6 మాసాల డ్యూటీ మాత్రమే చేస్తే ఏడున్నర రోజులు సిఎల్స్ మరియు మూడున్నర రోజుల స్పెషల్ సిఎల్స్  ఇవ్వాలి. 
  • ఆకస్మిక సెలవులు, ఆదివారములు, ప్రభుత్వసేలవులు అన్ని కలిపి 10 రోజులకు మించరాదు. అలా మించినచో అతడు కోరిన (Other than CLs) ఆకస్మికేతర సిఎల్ గా పరిగణించి అర్హత గల కోరిన సెలవును మంజూరి చేయాలి. 
  • ఆకస్మిక సెలవులను వేసవి సెలవులకు, జాయినింగ్ కాలమునకు 10 రోజులు మించిన టర్మ్ హాలిడేస్ లకు కలిపి తీసుకొనరాదు. 
  • వినతి పత్రము లేనిది ఆకస్మిక సెలవు మంజూరి చేయరాదు. 
  • G.O Ms.No. 112 తేదీ 03.06.1966 ప్రకారం సగం రోజు కూడా ఆకస్మిక సెలవు మంజూరు చేయవచ్చు. 
  • ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకుని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పై అధికారుల అనుమతితో ఈ సెలవును ఉపయోగించుకోవాలి.   
  • ప్రతి పాఠశాలలో సిఎల్ అకౌంట్ రిజిస్టర్ నిర్వహించాలి. 
  • ఒక నెలలో (3) రోజుల వరకు ఆలస్యముగా వచ్చినచో ఒక రోజు సిఎల్ గా పరిగణించాలన్న నిబంధన ఉపాధ్యాయులకు వర్తించదు. ప్రతి ఉపాధ్యాయుడు/ ప్రధానోపాధ్యాయుడు విధిగా ప్రార్థన సమయంలో హాజరు కానివారు 1/2 రోజుకు ఆకస్మిక సెలవుకై వినతి పత్రము సమర్పించి డ్యూటీ చేయాలి. 
  • ధర్నాలకు, సమ్మెలలో పాల్గొనడానికీ సాధారణ సెలవు మంజూరు చేయకూడదు.
      

IT Fy 2019-20 Section wise Info



          ఆదాయం సంపాదించిన ప్రతి ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం జీతం కావచ్చు, పెన్షన్ కావచ్చు లేదా పొదుపు ఖాతా నుండి వచ్చిన వడ్డీ, ఇంటి కిరాయికి ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయం మొదలగునవి ఆదాయంగా వచ్చిన వాటికి కూడా పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను శ్లాబులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఉన్నవిధంగానే కొనసాగించారు కానీ ఈ సంవత్సరం ఆదాయం 5లక్షల లోపు ఉన్న వారికి ఎలాంటి టాక్స్ కట్టకుండా ఉండే అవకాశం కల్పించారు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం ఆర్థిక సంవత్సరం 2019-20 గణనలో తేది 01.04.2019 నుండి 31.03.2020 వరకు పొందిన జీతభత్యాలు ఆదాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.

FY 2018 - 19 శ్లాబ్ రేట్స్ :

మొత్తం సొమ్ములో మొదటి 2.50 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.
2.50 లక్షల పైబడిన సొమ్ముకు 2,50,001 నుండి 5లక్షల వరకు 5%
5లక్షల పైబడిన సొమ్ముకు 12,500/- + 5,00,001 నుండి 10లక్షల వరకు సొమ్ముకు 20% 
10లక్షల పైబడిన సొమ్ముకు 1,12,500/- + 10,00,001 పైబడి ఉన్న మొత్తం సొమ్ముకు 30%

సీనియర్ సిటిజన్స్ కోసం

మొత్తం సొమ్ములో మొదటి 3లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు
3 లక్షల పైబడిన సొమ్ముకు 3,00,001 నుండి 5లక్షల వరకు 5%
5లక్షల పైబడిన సొమ్ముకు 10,000/- + 5,00,001 నుండి 10లక్షల వరకు 20% 
10లక్షల పైబడిన సొమ్ముకు 1,10,000/- + 10,00,001 పైబడి ఉన్న మొత్తం సొ8మ్ముకు 30%

సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసం

మొత్తం సొమ్ములో మొదటి 5లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు
5లక్షల పైబడిన సొమ్ముకు 5,00,001 నుండి 10లక్షల వరకు 20% 
10లక్షల పైబడిన సొమ్ముకు 1,00,000/- + 10,00,001 పైబడి ఉన్న మొత్తం సొమ్ముకు 30%

ఉదా 1: ఒక ఉద్యోగి ఆదాయంలో నుండి ఇంటి అద్దె, ఇతర మినహాయింపులు మరియు 1.50 లక్షల సేవింగ్స్ పోగా పన్ను చెల్లించాల్సిన ఆదాయము 7లక్షలు ఉన్నట్లయితే. అందులో మొదటి 2.5 లక్ష లకు పన్ను లేదు 2,50,001 నుండి 5లక్షలవరకు ఉన్న 2.50 లక్షల పై 5% చొప్పున 12,500/-, తరువాతి 5లక్షల పైబడి ఉన్న 2లక్షలకు 20% చొప్పున 40,000 గణించాలి. మొత్తంగా 12,500+40,000=52,500 అవుతుంది. కాని 7లక్షల నుండి పన్ను లేని 2.50లక్షలను తీసివేయగా వచ్చిన 4.5లక్షలకు 5% చొప్పున 22,500 గా లెక్కించడం సరికాదు.

ఉదా 2: ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన ఆదాయం 12లక్షలు ఉంది అనుకుంటె వారు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 10లక్షలు దాటింది కాబట్టి 12,00,000 X 30% = 3,60,000లుగా గణించడం సరికాదు.
2,50,000వరకు పన్ను లేదు, 2,50,001 నుండి 5లక్షలవరకు గల 2.5 లక్ష లకు 5% చొప్పున చెల్లించాల్సిన పన్ను 12,500/-, 5లక్షల నుండి 10 లక్షల  వరకు గల 5లక్షలకు 20% చొప్పున చెల్లించాల్సిన పన్ను 12,500 + 1,00,000 = 1,12,500/-, 10 లక్షల పైన గల 2లక్షలకు ఆదాయానికి 30% చొప్పున చెల్లించాల్సిన పన్ను 12,500 + 1,00,000 + 60,000  = 1,72,500/- చెల్లించాలి



Section 16 గత ఆర్థిక సంవత్సరం 2018-19కు నూతనంగా జీతం ద్వారా వచ్చిన ఆదాయంలో నుండి గరిష్టంగా Standard Deduction గా రూ.40,000 వరకు సెక్షన్ 16(ia) ద్వారా మినహాయింపునిచ్చారు దీనిని ఈ ఆర్థిక సంవత్సరం 2019-20కు 50,000 లకు పెంచారు.

Section 87A: ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 5లక్షల లోపు ఉన్న వారికి చెల్లించాల్సిన టాక్స్ లో రూ.12,500 లకు రిబేట్ సదుపాయాన్ని పెంచారు. ఈ సెక్షన్ ఉపయోగించుకుని 5లక్షల లోపు ఆదాయం కలిగిన వారు పూర్తి టాక్స్ మినహాయింపు పొందుతారు.


* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన అదనంగా చెల్లించాల్సిన ఎడ్యుకేషన్ సెస్ 4%.  

ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:- 

Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ||నవి ఆదాయంగా పరిగణించబడును.

ఆదాయముగా పరిగనించబడని అంశములు:- 

పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP (TS) GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు GPF, (TS) GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

మినహాయింపులు: 

1.             HRA మినహాయింపు: Under Section 10(13A) 
ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.
పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం 
ఇంటి అద్దె గా చెల్లించిన మొత్తం - 10% 
(Pay +DA) 40% వేతనం 

ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/- (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. IT Department circular No. 8/2013 Dt.  10.10.2013 ప్రకారం మీరు చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు. పేరెంట్స్ పేరు మీద ఉన్న ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్టయితే రెంట్ వారికి చెల్లిస్తున్నట్టు చూపితే పేరెంట్స్ మీ నుండి పొందిన రెంట్ డబ్బులను వారు ఆదాయంలో చూపాల్సి ఉంటుంది.



Section 80GG: ఎలాంటి ఇంటి అద్దె భత్యం పొందని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తన పేరిట కాని, తన స్పౌజ్ పెరిట కాని, తన మైనర్ పిల్లల పేరిట కాని ఎక్కడ కూడా ఇల్లు లేని, అద్దె ఇంట్లో ఉంటున్న వారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది
1.     Rent paid minus 10% of total income
2.     Rs. 5000/- per month
3.     25% of total income
పై మూడింటిలో ఏది కనిష్ఠమో దానిని పరిగణలకు తీసుకుని సంవత్సరానికి గరిష్ఠంగా 60,000 వరకు మినహాయింపు వర్తిస్తుంది.

2.ఇంటి ఋణం పై వడ్డి (Section24): ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒకవేళ ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానంగా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయికి ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.  

Section 80EEA: ఎలాంటి ఇల్లు లేకుండా మొదటిసారి ఇంటికొసం పైనాన్సియల్ ఇన్స్టిటూషన్ల (బ్యాంకు) నుండి రుణం పొంది. స్టాంప్ డ్యూటీ విలువ 45లక్షలు లేదా లోపు ఉండాలి 01.04.2019 నుండి 31.03.2020 మద్యన తీసుకున్న రుణం వడ్డీ పై Section 24 కి అదనంగా 1,50,000 వేల మినహాయింపు కలదు.

3.ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E): Self, Spouse, Children ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై 2018-19 ఆర్థిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు ఋణం ముగిసే వరకు లేదా గరిష్టం గా 8 సం. లు వర్తిస్తుంది.

4.ఆడరపడిన వారు వికలాంగులయితే (80DD): ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకొసం సంబంధిత అధికారులు జారిచేసిన సర్టిఫికెట్ పొంది ఉండాలి. 

5.ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తీ వికలాంగులయితే (80U): ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-, 80% లేదా అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి. 

6.అనారోగ్య చికిత్సకు అయిన ఖర్చు (80DDB): ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Haemophilia, Thalassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 1,00,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.

7.చందాలు (80G) :  PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గల వాటికి ఇచ్చే చందాలు మినహా ,  80G క్రింద కు వచ్చే 50% లేదా 30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.

* Note: సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2019 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గతంలో DTA / DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad) తిరిగి పొందవచ్చు.

8.మెడికల్ ఇన్సూరెన్స్ (80D): ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగికి మరియు పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- , సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 50,000/- మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి మరియు పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు. ఉద్యోగి కుటుంబ సభ్యులకు మరియు పేరెంట్స్ కోసం ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1,00,000/- వరకు మినహాయింపు కలదు. 

·  అంధులు లేదా చెవిటి మరియు మూగ లేదా తక్కువ అంత్య భాగాల వైకల్యంతో ఆర్థోపెడిక్‌ వికలాంగ ఉద్యోగులకు తన నివాస స్థలం మరియు అతని విధి స్థలం మధ్య ప్రయాణించు ప్రయోజనం కోసం అతని ఖర్చులను తీర్చడానికి రవాణా భత్యం గా మంజూరు చేయబడిన కన్వేయన్సు అలవెన్స్ ను sub-clause (ii) of clause (14) of section 10 ప్రకారం ప్రతినెల గరిష్టంగా 3200/- వరకు మినహాయింపు కలదు.

మనం ప్రతినెల చెల్లిస్తున్న వృత్తి పన్ను (Professional Tax) కి section 16 (iiiB) ప్రకారం పూర్తిగా మినహాయింపు కలదు.

పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష:

వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C):  GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువులకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్థిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు. 

Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC): LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం. 

3. CPS deduction (80CCD): 

కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల జీతం నుండి 10%చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం మినహాయింపు కలదు.
ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతాలో జమ చేస్తున్న CPS మ్యాచింగ్ గ్రాంట్  10% ని 80CCD(2) ప్రకారం జమయిన మొత్తాన్ని పొదుపు రూ. 1.5 లక్షలకు అదనంగా మినహాయింపు కలదు.  FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ము పైన 50,000/- వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు  సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వచ్చింది.

ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా మన రాష్ట్ర శాఖ వారు పైన 2 సందర్భాల గురించి ఆదాయపన్ను శాఖ వారి నుండి క్లారిఫికేషన్ కోరగా ఆదాయపన్ను శాఖ వారు F.No. Pr. CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80C కింద CPS నిధి కాకుండా 1.50 లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని 80CCD(1B) కింద చూపొచ్చా? 2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS) నిధి కాకుండా 1.50లక్షల కంటే తక్కువగా ఉండి CPS (NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమచేస్తే ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని 80C కి విడగొట్టొచ్చా? పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చారు.

 

* 80C, 80CCC, 80CCD ల పొదుపుల పైన మొత్తము గా 1.5 లక్షలు తగ్గింపు ఉంటుంది.


సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA): సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.  

*Note: DDO లు జీతం బిల్లు పొందే సమయములో డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నెంబర్స్ STO/ Online లో STO ల AIN & DDO ల TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా ఇ- పైల్లింగ్ ద్వారా TDS వివరాలు 31 జూలై, 2020 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది. సెక్షన్ 80TTB ప్రకారం ఆదాయపన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజెన్ అయితే 50వేలు వరకు మినహాయింపు కల్పించారు.

ఆదాయపు పన్నుకు సంబంధించి ఏఏ ఫారములు సమర్పించాలి? 
జనవరి మాసములో లేదా ఫిబ్రవరి మాసము మొదటి వారం లోపు మీ సేవింగ్స్ మరియు మినహాయింపులను తెలుపుతూ Form-12BB పూర్తిచేసి DDO లకు ఇవ్వాలి. వాటిని పరిగణలోకి తీసుకుని, నెలవారీగా చెల్లించిన జీతం మరియు జీతం ద్వారా చేసుకున్న పొదుపుల ఆధారంగా DDOలు విధిగా తమ పరిధిలోని ఉద్యోగుల Form-16ని తన పరిధిలోని ఉద్యోగులకు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ గా ఇవ్వాలి. ఉద్యోగులు బ్యాంకు లలో తమ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే వాటిపై బ్యాంకు వాళ్ళు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ గా Form 16A ని ఇస్తారు. ITR సమర్పించే సమయంలో 26AS ద్వారా చూసుకుని ఈ ఆదాయాన్ని Income from other source లో చూపిస్తూ DDO లు చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ Form 16 తో కలిపి సమర్పించాలి.
ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా పొందాలి. ఉద్యోగులు "ITR" ఫారములలో రిటర్న్ లను 31జూలై, 2020 లోపు Income Tax Department వారికి సమర్పించాలి. 

IT FY 2019-20 AY 2020-21 Full Version Calculator 

IT FY 2019-20 AY 2020-21


Income Tax FY 2019-20 AY 2020-21 Calculator











Privacy Policy

Privacy Policy

http://prtuts.org built the [PRTUTS] app as a Free app. This SERVICE is provided by http://prtuts.org at no cost and is intended for use as is.
This page is used to inform website visitors regarding our policies with the collection, use, and disclosure of Personal Information if anyone decided to use our Service.
If you choose to use our Service, then you agree to the collection and use of information in relation to this policy. The Personal Information that we collect is used for providing and improving the Service. We will not use or share your information with anyone except as described in this Privacy Policy.
The terms used in this Privacy Policy have the same meanings as in our Terms and Conditions, which is accessible at [PRTUTS] unless otherwise defined in this Privacy Policy.
Information Collection and Use
For a better experience, while using our Service, we may require you to provide us with certain personally identifiable information. The information that we request is will be retained by us and used as described in this privacy policy.
The app does use third party services that may collect information used to identify you.
Link to privacy policy of third party service providers used by the app
Log Data
We want to inform you that whenever you use our Service, in a case of an error in the app we collect data and information (through third party products) on your phone called Log Data. This Log Data may include information such as your device Internet Protocol (“IP”) address, device name, operating system version, the configuration of the app when utilizing our Service, the time and date of your use of the Service, and other statistics.
Cookies
Cookies are files with small amount of data that is commonly used an anonymous unique identifier. These are sent to your browser from the website that you visit and are stored on your device internal memory.
This Service does not use these “cookies” explicitly. However, the app may use third party code and libraries that use “cookies” to collection information and to improve their services. You have the option to either accept or refuse these cookies and know when a cookie is being sent to your device. If you choose to refuse our cookies, you may not be able to use some portions of this Service.
Service Providers
We may employ third-party companies and individuals due to the following reasons:
  • To facilitate our Service;
  • To provide the Service on our behalf;
  • To perform Service-related services; or
  • To assist us in analyzing how our Service is used.
We want to inform users of this Service that these third parties have access to your Personal Information. The reason is to perform the tasks assigned to them on our behalf. However, they are obligated not to disclose or use the information for any other purpose.
Security
We value your trust in providing us your Personal Information, thus we are striving to use commercially acceptable means of protecting it. But remember that no method of transmission over the internet, or method of electronic storage is 100% secure and reliable, and we cannot guarantee its absolute security.
Links to Other Sites
This Service may contain links to other sites. If you click on a third-party link, you will be directed to that site. Note that these external sites are not operated by us. Therefore, we strongly advise you to review the Privacy Policy of these websites. We have no control over and assume no responsibility for the content, privacy policies, or practices of any third-party sites or services.
Children’s Privacy
These Services do not address anyone under the age of 13. We do not knowingly collect personally identifiable information from children under 13. In the case we discover that a child under 13 has provided us with personal information, we immediately delete this from our servers. If you are a parent or guardian and you are aware that your child has provided us with personal information, please contact us so that we will be able to do necessary actions.
Changes to This Privacy Policy
We may update our Privacy Policy from time to time. Thus, you are advised to review this page periodically for any changes. We will notify you of any changes by posting the new Privacy Policy on this page. These changes are effective immediately after they are posted on this page.
Contact Us
If you have any questions or suggestions about our Privacy Policy, do not hesitate to contact us.
This privacy policy page was created at privacypolicytemplate.net and modified/generated by App Privacy Policy Generator

Compassionate Appointments

ప్రభుత్వం G.O.Ms.No 1005 Employment & Social Welfare Dept. dt. 27.12.1974 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ లో ఉండగా చనిపోతే, ఉద్యోగిపైన ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యుల పోషణ కోసం అర్హత కలిగి ఉన్న కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం చేయడానికి అనుమతించడం జరిగింది. Govt. Memo No. 58226/Ser-A/2000-2 GAD, dt. 01.05.2001 ప్రకారం కారుణ్య నియామకం పొందిన వ్యక్తి ఇతర కుటుంబ సభ్యుల పోషణ బాధ్యత చూడాలి కానీ అలా చూడని పక్షాన వారిని ఉద్యోగం నుండి తొలగించు అధికారం శాఖాధిపతులకు ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ఇన్వాలిడేషన్ - కారుణ్య నియామకాలను సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం G.O.Ms.No 661 G.A.(Ser.- G) department, dt. 23.10.2008 ద్వారా పునరుద్ధరించారు. 
  • మరణించిన ఉద్యోగి కుటుంబసభ్యులలో ఎవరూ సంపాదన పరులు లేనప్పుడు కుటుంబ సభ్యులలో ఒకరు కారుణ్య నియామకానికి అర్హులు. వీరికి నిర్ణిత వయసు (All Casts Upper age Limit for Spouse is 45 years as on application submitted for Compassionate Appointment vide G.O.Ms.No. 144 G.A. (Ser.-D) dept. dt. 15.06.2004) కలిగి నిర్ణిత విద్యా అర్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్ కు తత్సమాన స్థాయి మించని లేదా తక్కువ స్థాయి ఉద్యోగానికి అర్హులు. 
  • ఉద్యోగి చనిపోయిన తేదీ నుండి ఒకసంవత్సరం లోపల కారుణ్య నియామకం కోసం అప్లై చేసుకోవాలి. 
  • ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నా, 7సంవత్సారాలకు మించి కన్పించకుండా పోయిన ఉద్యోగిపై  ఆధారపడిన కుటుంబసభ్యులు కారుణ్య నియామకాలకు అర్హులే. 
  • అవివాహఉద్యోగి చనిపోతే వారి కుటుంబంలో ఎవరు సంపాదన పరులు లేకపోతే తమ్ముడికి కానీ చెల్లికి కానీ కారుణ్య నియామకానికి అర్హులు. 
  • ఉద్యోగి చనిపోయిన లేదా మెడికల్ ఇన్వాలిడేషన్ జరిగిన వారి పిల్లలు 16 సంవత్సరాలు ఉన్న ఉద్యోగానికి అర్హులే, వీరికి లాస్ట్ గ్రేడ్ ఉద్యోగంలో తాత్కాలికంగా నియామకం చేసి 18 సంవత్సరాలు నిండినాక పూర్తిస్థాయి నియామకం చేస్తారు.

కారుణ్య నియామకానికి అర్హులైన కుటుంబ సభ్యులు ఎవరు ?

చనిపోయిన ఉద్యోగి Spouse ఉద్యోగానికి అర్హతలు కలిగి ఉంటే వారికి (విధవరాలు ఉద్యోగం చేయాలనుకుంటే వారి స్వంత జిల్లాలో అయినా కానీ చనిపోయిన ఉద్యోగి పనిచేసిన జిల్లా అయినా కానీ ఎక్కడైతే క్షేమంగా ఉంటారో అక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులకు సిక్స్ పాయింట్స్ ఫార్ములాకు లోబడి నియమించవచ్చు Circular Memo NO. 28967/Ser. G/2004-1 dated 5-6-2004.) ఒకవేళ వారికి ఉద్యోగం చేయడం ఇష్టంలేని పక్షమున వీరు చూచించిన ఇతర కుటుంబ సభ్యులలో ఒకరు. 
  • కూతురు/ కుమారుడు 
  • ఆధారపడి జీవిస్తున్న విధవరాలైన కూతురు 
  • దత్తతీసుకున్న పిల్లలు (Adopted Children) 
  • పెళ్ళైన కూతురు ఒక్కరు మాత్రమే సంతానంగా ఉంటే 
  • పెళ్ళైన కూతుళ్లు ఇద్దరు ఉంటే అందులో ఒకరికి 
నోట్ : కారుణ్య నియామకం కోసం అప్లై చేసుకున్న వారి వయస్సు ఉద్యోగం పొందేనాటికి గరిష్ట వయస్సును దాటినా పర్వాలేదు, వారు ఉద్యోగం కోసం అప్లై చేసే రోజును మాత్రమే పరిగణలోకి తీసుకుని వీరికి ఉద్యోగం ఇవ్వాలి. 

a social security scheme to provide appointment up to or equal to or less than the category of Junior Assistant to the spouse or dependent Government servant

ఎక్స్గ్రేషియా (Exgratia) :

ఒకవేళ ఉద్యోగం చేయడానికి భార్య / భర్త కి ఇష్టం లేక లేదా అర్హతలు లేక పోయిన సందర్భములో కానీ పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు కానీ చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఎవరు సంపాదనపరులు లేనప్పుడు కొన్ని షరతులకు లోబడి G.O.Ms.No. 166 GA (Ser.-A) GAD dt. 31.03.2005 read with G.O.Ms.No. 59 GA (Ser.-A) GAD dt. 05.02.1993 ప్రకారం ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా (Exgratia) చెల్లిస్తారు.
  • IV class employees           Rs. 40,000/-
  • Non Gazetted Employees  Rs. 60,000/-
  • Gazetted Employees         Rs. 80,000/-

షరతులతో కూడిన కారుణ్య నియామకాలు : 

జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన స్థాయి పోస్టుకోసం కావలసిన కనీస నిర్దేశిత విద్యార్హతలులేని పక్షములో G.O.Ms.No 577 GA.(Ser.-A) Dept. Dt. 29.10.1993 as amended in G.O. G.O.Ms.No. 76 GA (Ser.-A) Dept. Dt. 16.03.1996 ప్రకారం గ్రాడ్యుయేషన్ అర్హతల కోసం 5 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కోసం 3 సంవత్సరాలు. G.O Ms.No. 612 G.A(Ser.-A) Dept. Dt. 330.10.1991 ప్రకారం టైపింగ్ కోసం 2 సంవత్సరాలు అనుమతినిస్తారు.  G.O.Ms.No. 151 GA (Ser.-G) Dept. Dt. 22.06.2004 ప్రకారం కనీస నిర్ధేశిత అర్హతలు  పొందిన తేదీ నుండి మాత్రమే సర్వీస్ క్రమబద్దీకరించబడుతుంది. 

నోట్ : కారుణ్య నియామకం  ద్వారా ఉంద్యోగం పొందిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యుల పోషణ భాద్యత విధిగా చూడాలి, నిర్లక్ష్యం చేసిన వారిని Govt. Circular Memo No. 58226-A/2002-2 G.A. (Ser.-A) department Dt. 01.05.2001 ప్రకారం ఉద్యోగంలో నుండి తొలగించే అవకాశం ఉంది.    

కారుణ్య నియామకాల కోసం కావలసిన సర్టిఫికెట్లు :

కారుణ్య  నియామకం కోసం దరఖాస్తు చేసే సమయంలో అప్లికేషన్ తో పాటు జత చేయాల్సిన పత్రాలు. 

  • Death Certificate
  • Affidavit Certificate ( No Objection Certificate)
  • Individual Application
  • Family Members Certificate
  • Employment Card
  • Qualification Certificate
  • SSC Certificate
  • Bonafide Certicate
  • No Earning Certificate
  • Residential Certificate
  • Caste Certificate (other than OC)
  • No Property Certificate   
  • Financial Status Certificate (by RDO)
మరణించిన ఉద్యోగి పనిచేసిన కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి.

నోట్ : కారుణ్య నియామకం ద్వారా ఉంద్యోగం పొందిన వ్యక్తి Govt. Circular Memo No. 40130/Ser.-G/2009-1 GA (Ser.-A) Dept. Dt. 18.06.2010 ప్రకారం నిర్దేశిత నియమ నిబంధనల మేరకు  పునర్వివాహం చేసుకున్నా కూడా ఉద్యోగంలో కొనసాగవచ్చు. 

మెడికల్ ఇన్వాలిడేషన్ పైన రిటైర్మెంట్ కి అనుమతించే వ్యాధులు :

  • పక్షవాతం
  • అంతిమ దశలో ఉన్న మూత్ర పిండముల వ్యాధి  
  • అంతిమ దశలో ఉన్న కాలేయ వ్యాధి 
  • క్యాన్సర్ వ్యాధి 
  • మానసిక వ్యాధి
  • పార్కిన్సన్ వ్యాధి 
మెడికల్ ఇన్వాలిడేషన్ పైన రిటైర్మెంట్ కావాలి అనుకునే వారు కమిటీకి పంపవలసిన వివరములు :
  • మెడికల్ ఇన్వాలిడేషన్ పొందే ఉద్యోగి పేరు 
  • ఉద్యోగి పనిచేసున్న శాఖా హోదా స్కేల్ అఫ్ పే 
  • క్రమ శిక్షణ చర్యలు పెండింగులో ఉన్నాయా 
  • ఉద్యోగి సర్వీస్ రెగ్యులర్ అయ్యిందా 
  • పుట్టిన తేదీ 
  •  పుట్టిన తేదీ ప్రకారం ఉద్యోగ విరమణ తేదీ 
  • వ్యాధి వివరములు 
  • ఆ వ్యాధి G.O.Ms.No 661 GAD dt. 23.10.2008  ప్రకారం ఉందా 
  • వ్యాధి చికిత్స కోసం ఉద్యోగి సెలవు పై ఉన్నారా ఉంటె ఆ వివరాలు 
  • మెడికల్ బోర్డువారి సిపార్సులు 
  • శాఖా పర సిపార్సులు 
మరణించిన ఉద్యోగి పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ ఆర్ధిక పరిస్థి దృష్ట్యా కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం చేస్తున్న సందర్భంలో కొంతవరకు స్థిరాస్తి, భూములు, ఇల్లు తదితరములు ఉన్నప్పటికీ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబ జీవనోపాధికి సరిపడ లేవని కారుణ్య  నియామకాలు చేయు అధికారి భావిస్తే కుటుంబంలో ఒకరికి Govt. Memo No. 535/Ser.-A/91-1/GA (Ser.-A) Dept. dt. 17.12.1979 ప్రకారం ఉద్యోగం ఇవ్వవచ్చు.
















RPS 2015 G.Os

PRC 2015 Incentive Allowance to Armed Head Constable, Armed Police Constable and Scout Allowance to Teachers - G.O 61

Risk Allowance G.O.Ms.No. 65 - Download

E.S.I allowance G.O.Ms.No. 67 Dt. 04.05.2015

Ration allowance G.O.Ms.No. 68 Dt. 04.05.2015


Attenders who are required to attend to the duties of Driver G.O.Ms.No. 71

Leprosy Allowance to Medical and Para Medical staff  G.O.Ms. No. 72

Fixed Travelling allowance ( FTA ) G.O.Ms.No. 73 Dt. 04.05.2015

Office Allowance and Maintenance Allowance G.O Ms.No. 74 Dt.04.05.2015

Uniform Maintenance Allowance G.O.Ms.No. 82 Dt. 26.05.2015

Incentives to the Staff on Deputation G.O.Ms.No. 83 Dt. 26.05.2015

HRA CCA to Judicial Services G.O.Ms.No 84 Dt. 26.05.2015

AHRA Amendment to the Police Department G.O.Ms.No. 85 Dt. 27.05.2015


GIS Slab rates in RPS 2015 G.O.Ms.No. 151

AHRA to Employees working in schedule area and projects

Enhanced Gratuity Arrears for period of 02.06.2014 to 28.02.2015

RPS Arrears for the period 02.06.2014 to 28.02.2015