Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Half Pay Leave - HPL

అర్ధవేతన సెలవులు :

  1. ప్రతి ఉద్యోగులకి/ ఉపాధ్యాయులకు ఒక సంవత్సరం పాటు విధులు నిర్వర్తించినచో ఆర్జిత సెలవులతో పాటు అర్ధవేతనము సెలవు (హాఫ్ పే లీవ్) 20 రోజులు ప్రీజర్వ్ అగును . ఒక సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాతనే ఈ 20 రోజులు జమ అగును. 6 మాసాల సర్వీస్ పూర్తిచేస్తే 10 రోజుల చొప్పున నిలువ చేయరు. 
  2. ఈ హాఫ్ పే లీవ్ అప్రెంటిస్ ఉపాధ్యాయులకు కూడా లభించును. (జి.ఓ.యం.యస్. నం 40 తేదీ 11-05-2006)
  3. ఈ సెలవు నిలువకు గరిష్ట పరిమితి లేదు. సంవత్సరమునకు 20 చొప్పున ఎన్నయైన నిలువ ఉండును. 
  4. ఈ  సెలవును ఒకే 180 రోజులకు మించి వాడుకొనరాదు. 
  5. అర్ధవేతన సెలవును అనారోగ్య కారణములచే వైద్య ధ్రువపత్రము ఆధారముగా వాడుకొనవచ్చును. వేతనం సెలవుకాలమునకు గాను సగము బేసిక్ పే, సగం మూలవేతనం పై వచ్చు డి.ఎ మరియు 180 రోజులవరకు పూర్తి హెచ్.ఆర్.ఎ. మరియు  సి.సి.ఎ లభించును (జి.ఓ.యం.ఎస్. నం. 28 తేదీ 09-03-2011) 180 రోజులకు మించిన అర్ధవేతనం సెలవు పై హెచ్.ఆర్.ఎ రాదూ. వేరు వేరు దఫాలలో 180 రోజులకు మించకుండా అర్ధవేతనము సెలవు తీసుకున్నచో పూర్తి హెచ్.ఆర్.ఎ పొందవచ్చును. 


  • అర్ధవేతన సెలవును అనారోగ్య కారణములతో వైద్య ధ్రువపత్రము ఆధారముగా కమ్యుట్ చేయవచ్చును. కమ్యుటేడ్ సెలవునకు గాను రెట్టింపు అర్థవేతనము సెలవులు ఖర్చు అగును. కానీ పూర్తి జీతము లభించును. మొత్తం సర్వీస్ లో 240 రోజులు వరకు మాత్రమే కమ్యుట్ చేసుకొనుటకు అవకాశం కలదు. (జి.ఓ.యం.ఎస్. నం 186 ఎఫ్&ఆర్. తేదీ 23-07-1975)
  • అర్ధవేతన సెలవును వ్యక్తిగత కారణములచే కూడా వాడుకొనవచ్చును. ఈ సెలవు మంజూరికి వైద్య ధ్రువ పత్రము అవసరము లేదు. కానీ అంశం 5 లో తెల్పిన విధంగా సగం బేసిక్ పే, దానిపై వచ్చు డి.ఎ. 6నెలలు వరకు పూర్తి హెచ్.ఆర్.ఎ మరియు సి.సి.ఎ లభించును. 
  • అర్ధవేతన సెలవును ఉన్నత చదువుల కొరకు వాడుకొనవచ్చును. 
  • సస్పెన్షన్ కాలమును అర్హత గల సెలవుగా కూడా అర్ధవేతన సెలవును వాడుకొనవచ్చును. కానీ కమ్యుటేడ్ చేయడానికి వీలు లేదు. 
  • అర్ధవేతన సెలవును ఆకస్మిక సెలవును తప్ప ఇతర అన్ని రకాల సెలవులతో కలిపి వాడుకొనవచ్చును. కానీ మొత్తము సెలవులు కలిపి 5 సంవత్సరాలకు మించకూడదు. 
  • అర్ధవేతన సెలవును సాధారణ డ్యూటీగానే పరిగణిస్తారు. కావున సీనియారిటీ, ఇంక్రిమెంట్లకు, ఆర్జిత సెలవు జామకు ఏరకమైన అడ్డంకి కావు. 
  • ఈ అర్ధవేతనం సెలవును వాడుకొనదలచిన రోజు వరకు ఎన్ని రోజులు నిలువ ఉండునో అన్ని రోజులు మాత్రమే వాడుకొనుటకు వీలుండును. 
  • దీర్ఘకాళికా వ్యాధులైన కుష్ఠు, క్షయ(టి.బి.) క్యాన్సర్, మెంటల్ డిసార్డర్ రోగముతో భాదపడువారు 6 నెలల వరకు అర్ధవేతన సెలవు వాడుకున్నచో పూర్తి వేతనం లభించును (జి.ఓ.యం.ఎస్.నం 188 తేదీ 30-07-1973) అదే విధముగా గుండెజబ్బులున్నవారు ((జి.ఓ.యం.ఎస్.నం 449 తేదీ 28-10-1976) ప్రకారము, కిడ్నీ మార్పిడి జరిగిన ఉద్యోగులు (జి.ఓ.యం.యస్. నం 268 తేదీ 29-10-1991) ప్రకారము 6 నెలల వరకు అర్ధవేతన సెలవులు వాడుకున్నచో పూర్తి వేతనం పొందవచ్చును. కానీ సంబంధితులు కూడా హాఫ్ పే లీవ్ కొనసాగినచో 181 వ రోజునుండి 240 రోజు వరకు పూర్తి హెచ్.ఆర్.ఎ మరియు సి.సిఎ వచ్చును. (జి.ఓ.యం.యస్. నం 29 తేదీ 09-03-2011)

 మిగిలిన అర్ధవేతన సెలవును నగదు చేసుకొనవచ్చు: 

        పదవీ విరమణ పొందిన నాటికి మిగిలి ఉన్న హెచ్.పి.ఎల్. ను నగదుగా మార్చుకొనవచ్చు  (జి.ఓ.యం.యస్. నం 154 తేదీ 04-05-2010) కాని ఇ.ఎల్. మరియు హెచ్.పి.ఎల్. ను కలిసి 300 రోజులకు మించరాదు. ఈ  సెలవులు పంచాయతీ ద్వారా పునరుద్ధరింపబడినది.  

అతనికి వచ్చు నగదు = (సగము వేతనం +డి.ఎ) X HPL
                                                              30  

వేతనం లేని సెలవులు :

       ఉపాద్యాయుడు లేక ఉద్యోగి తన సర్వీస్ లో సంపాదించుకున్న/ నిలువ ఉంచుకున్న ఆర్జిత సెలవులు / అర్ధవేతన సెలవులు మరియు అర్హత కలిగిన ఇతర సెలవులు లేనప్పుడు అత్యవసరమయినపుడు వేతనం లేని ఎక్స్ట్రార్డినరీ లీవ్ కలిగిన ఇతర సెలవులు లేనపుడు అత్యవసరయినపుడు వేతనం లేని  ఎక్స్ట్రార్డినరీ లీవ్ పూర్వానుమతితో వాడుకొనుటకు అవకాశం కలదు. ఉద్యోగి సంపాదించుకున్న సెలవులు నిలువ ఉన్నప్పటికీ ఉద్యోగి వ్రాతపూర్వకంగా వేతనం లేని సెలవు మంజూరి చేయాలని కోరినపుడు అధికారి వేతనము లేని సెలవు మంజూరి చేయవచ్చును. 

ఇ.ఓ.ఎల్.ను ఎవరు ఎన్ని రోజుల వరకు మంజూరి చేస్తారు? 

  1. ఆర్జిత సెలవును / అర్ధ వేతన సెలవును మంజూరి చేయు అధికారి వేతనం లేని సెలవును కూడా మంజూరి చేస్తారు. 
  2. 4 నెలల వరకు మండల పరిధిలోని  ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి గారు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆపాఠశాలల ప్రధానోపాధ్యాయుడు మంజూరి చేస్తారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు  విద్యాధికారి గారు మంజూరి చేస్తారు. 
  3.  అందరు ఉపాధ్యాయులకు, ప్రాధానోపాధ్యాయులకు 4 నెలల నుండి 6 నెలల వరకు ఉపవిద్యాధికారిగారు, 6 నెలల నుండి సంవత్సరము వరకు జిల్లా విద్యాధికారిగారు, సంవత్సరము నుండి 4 సంవత్సరముల వరకు ప్రభుత్వము మంజూరి చేయును. 
  4. ఇ.ఎల్.ను ఇతర సెలవులతో కలిపి వాడుకొనవచ్చును. (ఆకస్మిక సెలవులకు తప్ప) 
  5. వేతనం లేని సెలవు కాలము ఎన్ని రోజులో అన్ని రోజులు వార్షిక హెచ్చింపు ముందుకు జరుగును. 
  6. 6 మాసాల వరకు వేతనం లేని సెలవు వైద్యకారణములపై మంజూరి చేసినచో ఆ కాలమును వార్షిక హెచ్చింపుకు లెక్కించుటకు పాఠశాల సంచాలకులు అనుమతించవచ్చు. దీని కొరకై వినతి పత్రముతో పాటు మెడికల్ సర్టిఫికేట్, సర్వీస్ పుస్తకమును డి.ఇ.ఒ గారి ద్వారా డి.ఎస్.ఇ. గారికి ప్రతిపాదనలు పంపాలి. అవసరము అనుకుంటే డి.ఎస్.ఇ గారు మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తారు. (జి.ఓ.యం.యస్. నం 43 తేదీ 05-02-1976)
  7. 6 మాసాల పైబడి మెడికల్ గ్రౌండ్ పై ఇ.ఒ.ఎల్. తీసుకున్నచో ఆకాలమును ఇంక్రిమెంటుకు లెక్కించుటకు గాను ప్రభుత్వమునకు అధికారము కలదు. 
  8. వైద్యకారణములచే ఇ.ఒ.ఎల్. మంజూరి అయినచో 3 సంవత్సరములు కాలము వరకు పెన్షన్ లెక్కిస్తారు. సైన్టిఫిక్ మరియు టెక్నికల్ విద్యనభ్యసించుటకై మంజూరైన ఇ.ఒ.ఎల్. లను కూడా పెన్షన్ కు 36 నెలల వరకు పెన్షన్ లెక్కిస్తారు. (జి.ఓ.యం.యస్. నం. 102 ఎఫ్డ్&డి తేదీ 25-01-1996) 
  9. 5 సంవత్సరముల సర్వీస్ గల ఉపాధ్యాయులు/ ఉద్యోగులు విదేశాలలో ఉద్యోగము చేయుటకు గాను 5 సంవత్సరముల వరకు సెలవును మంజూరి చేయు అధికారము ప్రభుత్వమునకు కలదు. (జి.ఓ.యం.యస్. నం. 214 ఎఫ్డ్&డి తేదీ 03-09-1996) ఈకాలము రెండు లేదా మూడు లేదా అంతకన్నా ఎక్కువ ధపాలుగా వాడుకొనవచ్చును. 
  10. సంబంధిత అధికారి అనుమతి లేకుండా ఒక సంవత్సరము వరకు డ్యూటీకి అనుపస్థితులైన ఉద్యోగిని సర్వీస్ నుండి తొలగించవచ్చును. (జి.ఓ.యం.యస్. నం. 11  తేదీ 13-01-2004)
  11. ఏ రకమైన సెలవుకు కూడా కోరకుండ అనుపస్థితులైనచో ఆ కాలాన్ని డైస్ నాన్ గా కూడా పరిగణించవచ్చు. 

ఇ.ఒ.ఎల్ వాడుకున్న వారికి హెచ్.పి.ఎల్ లో సమానముగా ఎక్స్ గ్రేషియా :

          క్షయ (Tuberculosis), కుష్ఠు(Leprosy), క్యాన్సర్, మానసిక వ్యాధుల (Mental Illness), గుండె జబ్బులు మరియు కిడ్నీ (Renal) ఫెయిల్ అయిన వారి చికిత్సకై ఇ.ఒ.ఎల్ పై వెళ్ళితే అర్ధవేతనం సెలవుకు సమానమైన వేతనం 9460/- లను తగ్గకుండా 13,000/- మించకుండా సౌకర్యము ఎక్స్ గ్రేషియా చెల్లిస్తారు. కానీ ఈ సౌకర్యము 26,600/- లోపల మూల వేతనం కలవారికే ఇది వర్తిస్తుంది. 
          అదే విధముగా నాల్గవ తరగతి ఉద్యోగులకు అర్ధవేతనమునకు సమానముగా 6500/- లకు తగ్గకుండా మరియు 10,500/- లను మించకుండా చెల్లిస్తారు. జి.ఓ.యం.యస్ నం. 111 తేదీ 17-08-2015)