Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Half Pay Leave - HPL

అర్ధవేతన సెలవులు :

  1. ప్రతి ఉద్యోగులకి/ ఉపాధ్యాయులకు ఒక సంవత్సరం పాటు విధులు నిర్వర్తించినచో ఆర్జిత సెలవులతో పాటు అర్ధవేతనము సెలవు (హాఫ్ పే లీవ్) 20 రోజులు ప్రీజర్వ్ అగును . ఒక సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాతనే ఈ 20 రోజులు జమ అగును. 6 మాసాల సర్వీస్ పూర్తిచేస్తే 10 రోజుల చొప్పున నిలువ చేయరు. 
  2. ఈ హాఫ్ పే లీవ్ అప్రెంటిస్ ఉపాధ్యాయులకు కూడా లభించును. (జి.ఓ.యం.యస్. నం 40 తేదీ 11-05-2006)
  3. ఈ సెలవు నిలువకు గరిష్ట పరిమితి లేదు. సంవత్సరమునకు 20 చొప్పున ఎన్నయైన నిలువ ఉండును. 
  4. ఈ  సెలవును ఒకే 180 రోజులకు మించి వాడుకొనరాదు. 
  5. అర్ధవేతన సెలవును అనారోగ్య కారణములచే వైద్య ధ్రువపత్రము ఆధారముగా వాడుకొనవచ్చును. వేతనం సెలవుకాలమునకు గాను సగము బేసిక్ పే, సగం మూలవేతనం పై వచ్చు డి.ఎ మరియు 180 రోజులవరకు పూర్తి హెచ్.ఆర్.ఎ. మరియు  సి.సి.ఎ లభించును (జి.ఓ.యం.ఎస్. నం. 28 తేదీ 09-03-2011) 180 రోజులకు మించిన అర్ధవేతనం సెలవు పై హెచ్.ఆర్.ఎ రాదూ. వేరు వేరు దఫాలలో 180 రోజులకు మించకుండా అర్ధవేతనము సెలవు తీసుకున్నచో పూర్తి హెచ్.ఆర్.ఎ పొందవచ్చును. 


  • అర్ధవేతన సెలవును అనారోగ్య కారణములతో వైద్య ధ్రువపత్రము ఆధారముగా కమ్యుట్ చేయవచ్చును. కమ్యుటేడ్ సెలవునకు గాను రెట్టింపు అర్థవేతనము సెలవులు ఖర్చు అగును. కానీ పూర్తి జీతము లభించును. మొత్తం సర్వీస్ లో 240 రోజులు వరకు మాత్రమే కమ్యుట్ చేసుకొనుటకు అవకాశం కలదు. (జి.ఓ.యం.ఎస్. నం 186 ఎఫ్&ఆర్. తేదీ 23-07-1975)
  • అర్ధవేతన సెలవును వ్యక్తిగత కారణములచే కూడా వాడుకొనవచ్చును. ఈ సెలవు మంజూరికి వైద్య ధ్రువ పత్రము అవసరము లేదు. కానీ అంశం 5 లో తెల్పిన విధంగా సగం బేసిక్ పే, దానిపై వచ్చు డి.ఎ. 6నెలలు వరకు పూర్తి హెచ్.ఆర్.ఎ మరియు సి.సి.ఎ లభించును. 
  • అర్ధవేతన సెలవును ఉన్నత చదువుల కొరకు వాడుకొనవచ్చును. 
  • సస్పెన్షన్ కాలమును అర్హత గల సెలవుగా కూడా అర్ధవేతన సెలవును వాడుకొనవచ్చును. కానీ కమ్యుటేడ్ చేయడానికి వీలు లేదు. 
  • అర్ధవేతన సెలవును ఆకస్మిక సెలవును తప్ప ఇతర అన్ని రకాల సెలవులతో కలిపి వాడుకొనవచ్చును. కానీ మొత్తము సెలవులు కలిపి 5 సంవత్సరాలకు మించకూడదు. 
  • అర్ధవేతన సెలవును సాధారణ డ్యూటీగానే పరిగణిస్తారు. కావున సీనియారిటీ, ఇంక్రిమెంట్లకు, ఆర్జిత సెలవు జామకు ఏరకమైన అడ్డంకి కావు. 
  • ఈ అర్ధవేతనం సెలవును వాడుకొనదలచిన రోజు వరకు ఎన్ని రోజులు నిలువ ఉండునో అన్ని రోజులు మాత్రమే వాడుకొనుటకు వీలుండును. 
  • దీర్ఘకాళికా వ్యాధులైన కుష్ఠు, క్షయ(టి.బి.) క్యాన్సర్, మెంటల్ డిసార్డర్ రోగముతో భాదపడువారు 6 నెలల వరకు అర్ధవేతన సెలవు వాడుకున్నచో పూర్తి వేతనం లభించును (జి.ఓ.యం.ఎస్.నం 188 తేదీ 30-07-1973) అదే విధముగా గుండెజబ్బులున్నవారు ((జి.ఓ.యం.ఎస్.నం 449 తేదీ 28-10-1976) ప్రకారము, కిడ్నీ మార్పిడి జరిగిన ఉద్యోగులు (జి.ఓ.యం.యస్. నం 268 తేదీ 29-10-1991) ప్రకారము 6 నెలల వరకు అర్ధవేతన సెలవులు వాడుకున్నచో పూర్తి వేతనం పొందవచ్చును. కానీ సంబంధితులు కూడా హాఫ్ పే లీవ్ కొనసాగినచో 181 వ రోజునుండి 240 రోజు వరకు పూర్తి హెచ్.ఆర్.ఎ మరియు సి.సిఎ వచ్చును. (జి.ఓ.యం.యస్. నం 29 తేదీ 09-03-2011)

 మిగిలిన అర్ధవేతన సెలవును నగదు చేసుకొనవచ్చు: 

        పదవీ విరమణ పొందిన నాటికి మిగిలి ఉన్న హెచ్.పి.ఎల్. ను నగదుగా మార్చుకొనవచ్చు  (జి.ఓ.యం.యస్. నం 154 తేదీ 04-05-2010) కాని ఇ.ఎల్. మరియు హెచ్.పి.ఎల్. ను కలిసి 300 రోజులకు మించరాదు. ఈ  సెలవులు పంచాయతీ ద్వారా పునరుద్ధరింపబడినది.  

అతనికి వచ్చు నగదు = (సగము వేతనం +డి.ఎ) X HPL
                                                              30  

వేతనం లేని సెలవులు :

       ఉపాద్యాయుడు లేక ఉద్యోగి తన సర్వీస్ లో సంపాదించుకున్న/ నిలువ ఉంచుకున్న ఆర్జిత సెలవులు / అర్ధవేతన సెలవులు మరియు అర్హత కలిగిన ఇతర సెలవులు లేనప్పుడు అత్యవసరమయినపుడు వేతనం లేని ఎక్స్ట్రార్డినరీ లీవ్ కలిగిన ఇతర సెలవులు లేనపుడు అత్యవసరయినపుడు వేతనం లేని  ఎక్స్ట్రార్డినరీ లీవ్ పూర్వానుమతితో వాడుకొనుటకు అవకాశం కలదు. ఉద్యోగి సంపాదించుకున్న సెలవులు నిలువ ఉన్నప్పటికీ ఉద్యోగి వ్రాతపూర్వకంగా వేతనం లేని సెలవు మంజూరి చేయాలని కోరినపుడు అధికారి వేతనము లేని సెలవు మంజూరి చేయవచ్చును. 

ఇ.ఓ.ఎల్.ను ఎవరు ఎన్ని రోజుల వరకు మంజూరి చేస్తారు? 

  1. ఆర్జిత సెలవును / అర్ధ వేతన సెలవును మంజూరి చేయు అధికారి వేతనం లేని సెలవును కూడా మంజూరి చేస్తారు. 
  2. 4 నెలల వరకు మండల పరిధిలోని  ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి గారు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆపాఠశాలల ప్రధానోపాధ్యాయుడు మంజూరి చేస్తారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు  విద్యాధికారి గారు మంజూరి చేస్తారు. 
  3.  అందరు ఉపాధ్యాయులకు, ప్రాధానోపాధ్యాయులకు 4 నెలల నుండి 6 నెలల వరకు ఉపవిద్యాధికారిగారు, 6 నెలల నుండి సంవత్సరము వరకు జిల్లా విద్యాధికారిగారు, సంవత్సరము నుండి 4 సంవత్సరముల వరకు ప్రభుత్వము మంజూరి చేయును. 
  4. ఇ.ఎల్.ను ఇతర సెలవులతో కలిపి వాడుకొనవచ్చును. (ఆకస్మిక సెలవులకు తప్ప) 
  5. వేతనం లేని సెలవు కాలము ఎన్ని రోజులో అన్ని రోజులు వార్షిక హెచ్చింపు ముందుకు జరుగును. 
  6. 6 మాసాల వరకు వేతనం లేని సెలవు వైద్యకారణములపై మంజూరి చేసినచో ఆ కాలమును వార్షిక హెచ్చింపుకు లెక్కించుటకు పాఠశాల సంచాలకులు అనుమతించవచ్చు. దీని కొరకై వినతి పత్రముతో పాటు మెడికల్ సర్టిఫికేట్, సర్వీస్ పుస్తకమును డి.ఇ.ఒ గారి ద్వారా డి.ఎస్.ఇ. గారికి ప్రతిపాదనలు పంపాలి. అవసరము అనుకుంటే డి.ఎస్.ఇ గారు మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తారు. (జి.ఓ.యం.యస్. నం 43 తేదీ 05-02-1976)
  7. 6 మాసాల పైబడి మెడికల్ గ్రౌండ్ పై ఇ.ఒ.ఎల్. తీసుకున్నచో ఆకాలమును ఇంక్రిమెంటుకు లెక్కించుటకు గాను ప్రభుత్వమునకు అధికారము కలదు. 
  8. వైద్యకారణములచే ఇ.ఒ.ఎల్. మంజూరి అయినచో 3 సంవత్సరములు కాలము వరకు పెన్షన్ లెక్కిస్తారు. సైన్టిఫిక్ మరియు టెక్నికల్ విద్యనభ్యసించుటకై మంజూరైన ఇ.ఒ.ఎల్. లను కూడా పెన్షన్ కు 36 నెలల వరకు పెన్షన్ లెక్కిస్తారు. (జి.ఓ.యం.యస్. నం. 102 ఎఫ్డ్&డి తేదీ 25-01-1996) 
  9. 5 సంవత్సరముల సర్వీస్ గల ఉపాధ్యాయులు/ ఉద్యోగులు విదేశాలలో ఉద్యోగము చేయుటకు గాను 5 సంవత్సరముల వరకు సెలవును మంజూరి చేయు అధికారము ప్రభుత్వమునకు కలదు. (జి.ఓ.యం.యస్. నం. 214 ఎఫ్డ్&డి తేదీ 03-09-1996) ఈకాలము రెండు లేదా మూడు లేదా అంతకన్నా ఎక్కువ ధపాలుగా వాడుకొనవచ్చును. 
  10. సంబంధిత అధికారి అనుమతి లేకుండా ఒక సంవత్సరము వరకు డ్యూటీకి అనుపస్థితులైన ఉద్యోగిని సర్వీస్ నుండి తొలగించవచ్చును. (జి.ఓ.యం.యస్. నం. 11  తేదీ 13-01-2004)
  11. ఏ రకమైన సెలవుకు కూడా కోరకుండ అనుపస్థితులైనచో ఆ కాలాన్ని డైస్ నాన్ గా కూడా పరిగణించవచ్చు. 

ఇ.ఒ.ఎల్ వాడుకున్న వారికి హెచ్.పి.ఎల్ లో సమానముగా ఎక్స్ గ్రేషియా :

          క్షయ (Tuberculosis), కుష్ఠు(Leprosy), క్యాన్సర్, మానసిక వ్యాధుల (Mental Illness), గుండె జబ్బులు మరియు కిడ్నీ (Renal) ఫెయిల్ అయిన వారి చికిత్సకై ఇ.ఒ.ఎల్ పై వెళ్ళితే అర్ధవేతనం సెలవుకు సమానమైన వేతనం 9460/- లను తగ్గకుండా 13,000/- మించకుండా సౌకర్యము ఎక్స్ గ్రేషియా చెల్లిస్తారు. కానీ ఈ సౌకర్యము 26,600/- లోపల మూల వేతనం కలవారికే ఇది వర్తిస్తుంది. 
          అదే విధముగా నాల్గవ తరగతి ఉద్యోగులకు అర్ధవేతనమునకు సమానముగా 6500/- లకు తగ్గకుండా మరియు 10,500/- లను మించకుండా చెల్లిస్తారు. జి.ఓ.యం.యస్ నం. 111 తేదీ 17-08-2015) 

Types of Leaves - Facilities - Information

Earned Leave

ఆర్జిత లీవ్ (Earned Leave) :

  ప్రభుత్వ ఉద్యోగికి సంవత్సరమునకు 365/11 లెక్కన 33 వచ్చును. కానీ గరిష్టంగా సంవత్సరమునకు 30 రోజలకు మించకుండా సెలవు రిజర్వు చేయబడును. వెకేషన్ డిపార్టుమెంట్ లో పనిచేసే ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు 365/11 లెక్క చొప్పున 33 రోజులలో నుండి వేసవి సెలవులు వాడుకున్నందుకు గాను దాని నుండి 30 రోజులు తీసివేయాలి. అనగా 33-30 = 3రోజులు సెలవు రిజర్వు చేయబడును. ఈ నిబంధన 31-10-1989 వరకు అమలులో ఉన్నది. 

     తేదీ: 01-11-1989 నుండి 31-08-1994 మధ్యకాలంలో ఈ క్రింది లెక్కన (365/11)-28 = 33-28 =5రోజుల చొప్పున సంవత్సర కాలమునకు గాను ప్రిజర్వ్ చేయబడును(జి.ఓ. యమ్.ఎస్ నం. 354 తేది 20-11-1989). తేదీ 01-09-1994 తర్వాత ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 317 తేదీ 15-09-1994 ప్రకారం వెకేషన్ డిపార్టుమెంట్ లో పనిచేయుచున్న ఉద్యోగులకు ఉపాధ్యాయులకు (365/11)-27=6 రోజులు సెలవు ప్రిజర్వ్ అగును. ఈ సెలవులను రెండు దఫాలలో అడ్వాన్స్ గా జనవరిలో 3 మరియు జులైలో 3 చొప్పున ప్రిజర్వ్ చేయాలి. 

వేసవిలో పని చేసినచో సెలవు రిజర్వు :
       వెకేషన్ డిపార్టుమెంట్ లో పనిచేసే ఉద్యోగులు / ఉపాధ్యాయులు 23వ ఏప్రిల్ నుండి జూన్ 11 వ తేదీ వరకు వేసవి సెలవులు అనుభవించవచ్చును. కాని ప్రభుత్వం తమకు అవసరమయిన పనులు (ఎలక్షన్ వర్క్, ఓటర్ జాభితా తయారుచేయడము, సెన్సెస్, పల్స్ పోలియో, పదవతరగతి సప్లిమెంటరీ పరీక్షలు మరియు ఇతర పనులు) చేయించుకున్నప్పుడు, వేసవి సెలవులలో కొంతభాగము లేదా మొత్తం వేసవి సెలవులు వాడుకొనకుండా నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయును. అలంటి సంధర్భాల్లో ఆ ఉద్యోగులకు / ఉపాధ్యాయులకు ఎఫ్.ఆర్ 82 ప్రకారం సెలవు ప్రిజర్వ్ చేయమని డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఉత్తర్వులు ఇస్తారు. వేసవి సెలవు మొత్తం వాడుకొననిచో ఇతర ఉద్యోగులకువలె 365/11=33 (గరిష్టం 30) 30 రోజుల సెలవు రిజర్వు అగును. కాని ప్రతిసంవత్సరం యధావిదధిగా రిజర్వ్ చేయు ఆర్జిత సెలవు (ఇ.ఎల్) లను ఈ 30 రోజుల నుండి మినహాయించాలి. ఈ క్రింద తెలిపిన ఆయా కాలములో సెలవు ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేయాలో వివరించనైనది. 
  1. తేది 30-10-1989 కన్న ముందు వచ్చిన వేసవి సెలవులలో 15 రోజులకన్నా తక్కువ వేసవి సెలవులు వాడుకొనినచో 27 రోజులు (30-3=7 రోజులు) నిలువ చేయవచ్చును. (డైరెక్టర్ గారి ఆర్.సి.నెం. 1/85/పి. తేది 11-01-1985) 
  2. 15 రోజులకు మించి సెలవులు వాడుకున్నచో ద్యూటికి పిలిపించిన కాలము మరియు వేసవి సెలవుల కాలము పరిగణలోనికి తీసుకుని దామాషా ప్రకారము సెలవు రిజర్వు చేయవలసి యుండును. 
  3. తేది 01-09-1994 తరువాత వేసవి సెలవులలో పనిచేసిన వారికి ఈక్రింది సూత్రం ప్రకారము సెలవు ప్రిజర్వ్ చేయవలసి ఉండును(జి.ఓ.యమ్.ఎస్. నం. 317 తేది 15-09-1994) 
ఉదా.  
  • 16 రోజులు వేసవి సెలవులలో పనిచేసినచో అతనికి (365/11)-27X33/49 =15 రోజులు.  రెగ్యులర్ గా ప్రతి  సంవత్సరం ప్రిజర్వ్ చేయు 6 ఇ.ఎల్. లను  తీసివేయగా ఇంకను 9 రోజలు రిజర్వ్ చేయాలి. 
  • ఒకరు 11 రోజులు పనిచేసిన వారికి (365/11)-27X38/49=12 రోజులు -6రోజులు = 6 రోజులు రిజర్వు చేయాలి 

ఆర్జిత సెలవుల నిలువ గరిష్ట విలువ :  

  1. డిసెంబర్ 1982 వరకు ఆర్జిత సెలవుల నిలువ గరిష్ఠపరిమితి 180 రోజులు ఉండేవి. 
  2. జనవరి 1983 నుండి 15-09-2005 మధ్యకాలంలో ఆర్జిత సెలవులు & ప్రిజర్వ్ సెలవులు కలిపి నిలువ ఉంచుకొను గరిష్ఠ పరిమితి 240 రోజులుగా ఉండినవి. (జి.ఓ.యం.ఎస్. నం. 10 తేది 10-01-1983)
  3. తేది 16-09-2005 నుండి ఆర్జిత సెలవులు + ప్రిజర్వ్ సెలవులు కలిపి నిలువ ఉండవలసిన గరిష్ఠ పరిమితి 300 రోజులకు పెంచబడినది. (జి.ఓ.యం.ఎస్. నం. 232 తేది 16-09-2005)
     Note : గరిష్ఠ పరిమితి (300రోజులు) కన్నా మించిన ఆర్జిత సెలవులు లాప్స్ అవుతాయి. 
  • నిలువ ఉన్న ఆర్జిత సెలవులను 03-05-2010 లోపల అయితే 120 రోజుల వరకు ఒకేసారి వాడుకొనవచ్చును. (APLR Rule.III) తేది 04-05-2010 తర్వాత ఈ  ఆర్జిత సెలవులను ఒకేసారి 180 రోజుల వరకు వాడుకొనవచ్చును. (జి.ఓ.యం.ఎస్. నం. 153 Fin (FR.I) Dept. తేది 04-05-2010) 

ఆర్జిత సెలవు సరెండర్ : 

      గరిష్ఠ పరిమితికి మించకుండా లేదా ఆర్ధిక అవసరాల దృష్టి ప్రతి ఉద్యోగి/ ఉపాద్యాయుడు సంవత్సరమునకు 15 రోజుల ఆర్జిత సెలవులను / ప్రిజర్వ్ చేసిన సెలవులను ప్రభుత్వమునకు సరెండర్ చేసి నగదు డబ్బులు పొందవచ్చును. ఒక సంవత్సరములో సరెండర్ చేయని వారు రెండవ సంవత్సరంలో 30 రోజుల ఆర్జిత సెలవులను సరెండర్ చేయవచ్చును. (జి.ఓ.యం.ఎస్. నం. 334 Fin. Dept. తేది 28-09-1997) 
       గతంలో సరెండర్ చేసిన తేది నుండి 12 నెలల కాలము గడచిన తర్వాత 15రోజులు 24 నెలల కాలము గడచిన వారు 30 రోజులు ఆర్జిత / ప్రిజర్వ్ సెలవులను సరెండర్ చేసుకొ వచ్చును.  
Govt. Memo No. 10472/C199/PR.I/2009 Dt. 29-04-2009 మరియు Govt. Memo No. 14781-C/278/FR.I/2011 Dt. 22-06-2011 ప్రకారం 12నెలలు/30నెలలు అంతరంతో ఏ నెలలో అయినా సరెండర్ చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 30వ తేది నాటికి 286 లేదా అంతకంటే ఎక్కువ ఇ.ఎల్. లు నిలువ ఉన్నవారు వేచి చూడకుండానే సెలవులు సరెండర్ చేసుకొనవచ్చును. 

ఆర్జిత సెలవులతో కలిపి ఏ ఏ సెలవులు వాడుకొనవచ్చు? 

      ఆర్జిత సెలవులతో కలిపి ఆకస్మిక సెలవులు తప్ప ఇతర రకాల సెలవులతో (అర్ధవేతనము సెలవు, కమ్యుటేడ్ సెలవు, వేతనము లేని సెలవు మొదలగువాటితో) కలిపి వాడుకొనవచ్చు. వేసవి సెలవులకు ముందుగాని లేక సెలవు తరువాత గాని సెలవులతో కలిపి వాడుకొనవచ్చు. వేసవి సెలవులకు ముందు రోజుగాని లేక తరువాత రోజుగాని రోజు తప్పనిసరిగా డ్యూటిలో ఉండాలి. (లాస్ట్ వర్కింగ్ డే గాని, రీ ఓపెనింగ్ డే గాని, ఎదో ఒక రోజు తప్పనిసరిగా డ్యూటిలో ఉండాలి.) లేనిచో వేసవి సెలవులు మొత్తము సెలవుగా పరిగణించబడును. 

ఆర్జిత సెలవులను ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చును? మిగిలియున్న సెలవులు ఏమి చేయాలి? 

     అవసరముల దృష్ఠా ఆర్జిత సెలవులను ఒకేసారి 180 రోజులకు మించి వాడుకొనరాదు. చేలంచలుగా 180 రోజుల చొప్పున  (ప్రతిసారి) వాడుకోనుటకు అవకాశము కలదు. పదవీ విరమణ పొందిన తరువాత మిగిలిన ఉన్న సెలవులను (300 రోజుల గరిష్ఠపరిమితి) అమ్ముకుని నగదుగా మార్చుకోవచ్చును. (జి.ఓ.యం.ఎస్. నం. 232 తేది 16-09-2005) 

Leave Sanction - Joining Permission

సెలవులను ఎవరు మంజూరి చేస్తారు? ఎన్ని రోజులు మంజూరి చేస్తారు? 

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 70 తేదీ 06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులు, ఏరకమైన సెలవులు మంజూరి చేయాలో వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయబడినవి, సెలవులు మంజూరు చేయు అధికారే జాయినింగ్ పర్మిషన్ ఇస్తారు. 
  1. ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధాయులు : ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఆపాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరి చేస్తారు. 15 ఆకస్మిక సెలవులు, 7 ప్రత్యేక ఆకస్మిక సెలవులు,  ఒకేసారి ఆకస్మిక సెలవులు/ ప్రత్యేక ఆకస్మిక సెలవులు మరియు సెలవులని మించకుండా మంజూరి చేయవలసి ఉండును. 
  2. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధాయుడు : ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకస్మిక సెలవులు/ ప్రత్యేక ఆకస్మిక సెలవులు/ ఆర్జిత సెలవులు/ అర్ధవేతన సెలవులు/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నాలుగు నెలల వరకు మంజూరి చేయవచ్చును. కానీ సెలవుల అనంతరం తిరిగి అదే పాఠశాలలో చేరి విధులు నిర్వర్తించాలి.
  3. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు :తన పరిధిలోని ప్రాధమికోన్నత /ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు 10 రోజుల వరకు ఆకస్మిక సెలవులు / ప్రత్యేక ఆకస్మిక సెలవులను మంజూరు చేస్తారు  
  4. మండల విద్యాధికారి :  ప్రాధమికోన్నత /ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు / అర్ధవేతనము సెలవులు / కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నాలుగు నెలల వరకు మంజూరి చేయవచ్చును. కానీ సెలవుల అనంతరం ఉపాద్యాయులు /ప్రధానోపాధ్యాయులు తిరిగి అదే పాఠశాలలో చేరి విధులు నిర్వర్తించాలి.
  5. ఉప విద్యాధికారి : తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల, ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు / ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ఉన్నత / ప్రాధమికోన్నత /ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు/ అర్ధవేతన సెలవులు/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు నాలుగు నెలల పైబడి ఆరు నెలల వరకు మంజూరి చేస్తారు.కానీ సెలవుల అనంతరం తిరిగి అదే పాఠశాలలో చేరి విధులు నిర్వర్తించాలి. 
  6. జిల్లా విద్యాధికారి : జిల్లాలోని ఉపవిద్యాధికారులకు, మండల విద్యాధికారులకు ఆకస్మిక సెలవులు / ప్రత్యేక ఆకస్మిక సెలవులు/ ఆర్జిత సెలవులు/ అర్ధవేతన సెలవులు/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు ఒకసంవత్సరం వరకు మంజూరి చేయవచ్చును. జిల్లాలోని అన్ని ఉన్నత/ ప్రాథమికోన్నత / ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి ఒక సంవత్సరం వరకు అన్ని రకాల సెలవులు మంజూరి చేస్తారు, కానీ సెలవుల అనంతరం తిరిగి అదే పాఠశాలలో చేరి విధులు నిర్వర్తించాలి. 
  7. డైరెక్టర్ ఆప్ స్కూల్ ఎడ్యుకేషన్ : మండల విద్యాధికారులకు/ ఉన్నత పాఠశాలల / ప్రాథమికోన్నత పాఠశాలల / ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను ఒకసంవత్సరం నుండి 4సంవత్సరాలవరకు సెలవు మంజూరు చేస్తారు, వారు తిరిగి పూర్వపు స్థానంలో / పాఠశాలలో మాత్రమే చేరి విధులు నిర్వర్తించవలసి ఉండును. 
సెలవు అనంతరం జాయినింగ్ పెర్మిషన్ 
     మంజూరయిన సెలవులను వాడుకున్నమరుసటిరోజు విధులలో చేరుటకు గాను అనుమతికై సెలవు మంజూరి అధికారికి వినతి పత్రం సమర్పించాలి. వైద్య కారణములపై సెలవు మంజూరి అయినచో వైద్యునిచే ఫిట్నెస్ సర్టిఫికెట్ జతపరచాలి. సెలవు మంజూరి అధికారి వెంటనే జాప్యము చేసినచో జాప్యము చేసిన అధికారి వేతనం నుండి రికవరీ చేసి వెయిటింగ్ చేసిన కాలమునకు ఆ ఉపాధ్యాయునికి వేతనం చెల్లించవలసి ఉండును. (జి.ఓ. యం.యస్.నం. 70 తేదీ 06-07-2009) 

జాయినింగ్ అనుమతి ఎవరు ఇవ్వాలి? 

     ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు నాలుగు నెలలు లేదా అంతకు లోపు సెలవు మంజూరి చేయించుకుని సెలవు పూర్తి అవగానే విదులలలో చేరడానికి అనుమతి కోరిన వారికి ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయుడే జాయినింగ్ అనుమతిస్తారు. 

   మండల విద్యాశాఖాధికారి పరిధిలోని ప్రాథమిక / ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులకు /ఉపాధ్యాయులు నాలుగు నెలలు లేదా అంతకు లోపు సెలవు మంజూరి చేయించుకుని సెలవు పూర్తి అవగానే విదులలలో చేరడానికి అనుమతి కోరిన వారికి మండల విద్యాశాఖాధికారి జాయినింగ్ అనుమతిస్తారు.

     అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు/ ప్రధానోపాధ్యాయులు నాలుగు నుండి ఆరు నెలల సెలవు మంజూరు చేయించుకుని సెలవు పూర్తి అవగానే విదులలలో చేరడానికి అనుమతి కోరిన వారికి ఉప విద్యాశాఖాధికారి జాయినింగ్ అనుమతిస్తారు. 

   అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు/ ప్రధానోపాధ్యాయులు ఆరు నుండి ఒక  సంవత్సరం వరకు సెలవు మంజూరు చేయించుకుని సెలవు పూర్తి అవగానే విదులలలో చేరడానికి అనుమతి కోరిన వారికి జిల్లా విద్యాశాఖాధికారి జాయినింగ్ అనుమతిస్తారు. 

  మండల విద్యాధికారులు ఒకసంవత్సరం వరకు సెలవులు వాడుకున్నచో వారికి జిల్లా విద్యాధికారి గారు జాయినింగ్ అనుమతినిస్తారు. 

  ఒక సంవత్సరం నుండి 4 సంవత్సరముల లోపల సెలవులు వాడుకున్న మండల విద్యాధికారులకు, ఉన్నత / ప్రాథమికోన్నత / ప్రాథమిక పాథశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు జాయినింగ్ అనుమతి డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఇస్తారు. 

(జి.ఓ. యం.యస్.నం. 70 తేదీ 06-07-2009) అదనపు సూచనలు (గైడ్లైన్స్) 
  1. సెలవు పై వెళ్లివచ్చి జాయినింగ్ పర్మిషన్ కోరిన ప్రధానోపాధ్యాయులకు / ఉపాధ్యాయులకు / మండల విద్యాధికారులకు పూర్వపు స్థానములో చేరుటకు మాత్రమే అనుమతిస్తారు. 
  2. మంజూరు అయిన సెలవులు వాడుకున్న తరువాత 15 రోజులలో చేరని వారి విషయంలో తప్ప ఎటువంటి సందర్భంలో సెలవు వెకెన్సీని భర్తీచేయరాదు. 
  3. సెలవు కాలము ముగిసిన తర్వాత విధులలో చేరని ఉపాధ్యాయుల వివరములు సెలవు కాలము ముగిసిన వారము లోపల సంబంధిత ప్రధానోపాధ్యాయుడు లేక మండల విద్యాధికారి గారు వెంటనే జిల్లా విద్యాధికారి గారికి రిపోర్ట్ చేయాలి. 
  4. జిల్లా విద్యాధికారిగారు ఆ ఉపాధ్యాయునికి వెంటనే విధులలో చేరమని నోటీసు పంపాలి. అతని నుండి ఏరకమైన స్పందన రానిచో అతని స్థానమున ఇతర ఉపాధ్యాయులచే భర్తీ చేస్తారు. సెలవుపై వెళ్లిన ఉపాధ్యాయుడు గణితం / సైన్స్ / ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు అయితే వెంటనే భర్తీ చేయాలి. 
  5. సెలవు కాలము ముగిసిన పిదప 15 రోజులలో జాయిన్ కానిచో అతనిని నాలుగవ క్యాటగిరికి చెందిన ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తూ అక్నాలెడ్జ్మెంట్ తో కూడిన  రిజిష్టర్ పోస్ట్ ద్వారా ఆ ఉపాధ్యాయుని ఇంటికి ఉత్తర్వులు పంపబడును. ఈ చర్య సెలవు కాలం ముగిసిన 15 రోజుల తర్వాత 7 రోజులలో జరగాలి. 
  6. పోస్టింగ్ ఆర్డర్ అందిన 15 రోజులలో నూతన పాఠశాలలో చేరనిచో ఈ ఉపాధ్యాయులకు తిరిగి జిల్లా విద్యాధికారి గారు ఒక నోటీసు సర్వ్ చేస్తూ డ్యూటీ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు, దానికి గాను క్రమశిక్షణ చర్యలు గైకొనబడునని, అనుపస్థితి కాలమునకు డైస్  నాన్ గా పరిగణించబడునని హెచ్చరిస్తారు. (డైస్ నాన్ అనగా ఆ కాలమును సర్వీస్ క్రింద లెక్కించరు.)
 కావున సెలవు కాలము పూర్తయిన వెంటనే విధులలో తప్పనిసరిగా జాయిన్ కావాలసియుండును. లేదా సరైనా కారణములు చూయించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా సెలవు పొడగింపు కోసం వినతి పత్రం పంపాలి. 

 వాడుకొను సెలవు  రకమును ఎవరు నిర్ణయిస్తారు? 

    సెలవు పై వెళ్లదలచిన ఉపాధ్యాయుడు తాను వాడుకొనదలచిన సెలవు రకమును తన వినతి పత్రము (అప్లికేషన్ ఫారం నెం. 11) యందు పొందుపరచాలి. ఉద్యోగి కోరుకున్న సెలవును అధికారి మంజూరు చేయాలి. సంబంధిత అధికారి పలానా సెలవు తీసుకొమ్మని ఉద్యోగిని / ఉపాధ్యాయుని బలవంత పెట్టరాదు. అనగా ఏరకము సెలవు కావాలో ఉపాధ్యాయుడే నిర్ణయించుకొను అధికారం కలిగి ఉంటాడు. (ఎఫ్.ఆర్. 67) అనారోగ్య కారణాలచే సెలవును కోరినచో వైద్య దృవపత్రం జతపరచాలి.

Available Leaves - PRTU కృషి

సెలవు నిబంధనలు - పరిచయం 

ప్రభుత్వం తన ఉద్యోగులకు, ఉపాద్యాయులకు వివిధ రకాల సెలవులను వాడుకొనుటకు అవకాశం కలిగిస్తూ నిబంధనలు రూపొందించింది. ఈ నియమ నిబంధనలు ఆం.ప్ర. లీవ్ రూల్స్ 1933 లోను ఫండమెంటల్ రూల్స్ లో పొందుపరిచారు. 
సెలవు : ఉద్యోగి తన సర్వీసులో అత్యవసర పరిస్థితులలో లేదా అనారోగ్య కారణాలతో భాధపడుచున్నపుడు డ్యూటీ నుండి మినహాయింపు నిచ్చే అనుమతినే సెలవు అంటారు. 
సెలవులలో రకాలు : ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవులు ఐచ్చిక సెలవులు రెండవ శనివారాలు, ఆదివారాలు, విద్యాశాఖలో అయితే వేసవి సెలవులు, టర్మ్ హాలిడేస్ పోగా నిబంధనలకు అనుగుణంగా మిగితా ప్పనిదినాలలో ఉద్యోగి కోరిన సందర్భంలో ఈక్రింది రకాల సెలవులు మంజూరి చేయవచ్చు. 
  • ఆర్జిత సెలవు (E.L ) 
  • అర్థవేతనం సెలవు (H.P.L)
  • వేతనం లేని సెలవు (E.O.L )
  • ఆకస్మిక సెలవులు (C.L)
  • ప్రత్యేక ఆకస్మిక సెలవులు (Spl.C.L)
  • కంపెన్సేటరీ లీవ్ (C.C.L)
  • ప్రసూతి సెలవులు 
  • పితృత్వ సెలవులు 
  • స్పెషల్ దిజాబిలిటీ లీవ్ 
  • లీవ్ నాట్ డ్యూ

PRTU కృషిమేరకు లభించిన సెలవు సౌకర్యాలు 

      ఈనాడు అందరం ఉపాధ్యాయులం అనుభవిస్తున్న సెలవులు పంచాయతీరాజ్ సంస్థలలో పనిచేయు ఉపాధ్యాయులకు వర్తించేవి కావు. అవి 
      ఆకస్మిక సెలవు/ ప్రత్యేక ఆకస్మిక సెలవు, ప్రసూతి సెలవు, సరెండర్ సెలవు, Encashment లీవ్, (పదవీ విరమణ తరువాత నగదుగా మార్చుకునే సెలవు) మరియు దీర్ఘ కాళికా వ్యాదులైన క్షయ, కుష్టు, గుండె, క్యాన్సర్, కిడ్నీ, వ్యాధులకు ఇచ్చు 6 నెలల ప్రత్యేక సెలవులు ఏవియు కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఉండేవి కావు. 
  1. PRTU 1971 లో ఏర్పడిన తరువాత PRTU ప్రతినిధ్యము మేరకు పి.ఆర్ మహిళ ఉపాధ్యాయినీలకు ప్రసూతి సెలవులు G.O.Ms.No 463 తేదీ 04-05-1979 ద్వారా లభించినవి. 
  2. సరెండర్ సెలవు సౌకర్యం G.O.Ms.No 418 తేదీ 18-04-1979 ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు వర్తింపచేయబడినవి. 
  3. పదవీ విరమణ తరువాత లభించు ఇ.ఎల్ నగదు గా మార్చుకునే సౌకర్యాన్ని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు  తేదీ 31-03-1985 నుండి G.O.Ms.No 264 తేదీ 08-08-1985 ద్వారా లభించినవి. 
  4.  దీర్ఘకాలిక వ్యాదులకిచ్చు 6 మాసాల అర్ధవేతన సెలవుకు పూర్తివేతనం ఇచ్చు సౌకర్యం కూడా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు  G.O.Ms.No 590 తేదీ 06-08-1980 ద్వారా లభించినది. 
  5. PRTU 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశమునకు అప్పటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మహిళలకు 5 అదనంగా ఆకస్మిక సెలవులు  G.O.Ms.No 374 తేదీ 16-03-1996 ద్వారా సాధించారు. 
  6. భార్య ప్రసవిస్తే పురుషులకు కూడా 15 రోజుల పితృత్వ సెలవులు G.O.Ms.No 231 తేదీ 16-09-2005 ద్వారా 15 రోజుల పితృత్వ సెలవులను ఇప్పించారు. 
  7. అనేక విద్యా సదస్సులు నిర్వహింపచేసి ఆసదస్సులకు మరియు క్రీడోత్సవాలు ఏర్పాటు చేసి వాటికి ఉపస్థితులయిన వారికి ఓ.డి. సౌకర్యం కల్పించుటలో మన సఘం కృషి అమోఘము.
  8. అంతెందుకు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం TTJAC తరపున నిర్వహించిన సమ్మె కాలానికి O.D సౌకర్యం ఇప్పించుటలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల కృషి వెలకట్టరానిది. 

Service Rules - Promotions - AAS

పదోన్నతులు - అప్రయత్న పదోన్నతులు - అర్హతలు 

ఉపాధ్యాయులు పదోన్నతులు పొందడానికి,పదోన్నతులు పొందడం ఆలస్యం అయిన సందర్భంలో నిర్దిష్టకాల వ్యవధిలో అప్రయత్న పదోన్నతులు పొందడానికి కావలసిన అర్హతలు మినహాయింపులను గురించి చూద్దాం. 

పదోన్నతులు - అర్హతలు - మినహాయింపులు 

గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ - II :- 

బ్యాచిలర్ డిగ్రీలో ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ మరియు బి.ఎడ్ విద్యార్హతలు కలిగి ఉండాలి లేదా సాధారణ విద్యార్హతలయినా SSC మరియు 5సం. ల తదుపరి చదువులతో డిగ్రీ పట్టాపొంది, వృత్తిసంబంధ కోర్సులయిన బి.ఎడ్/ బి.పి.ఎడ్/ పండిత్ ట్రైనింగ్ / B.Com with another degree or P.G కల్గిఉన్నవారు అర్హులు.

SSC/ HSC/ MPHSC ఇంటర్మీడియేట్ పాసయి 5సం, 4సం, 3సం. ల ఓరియంటల్ టైటిల్ డిగ్రీ చదివి మరియు పండిట్ ట్రైనింగ్ పూర్తిచేసిన స్కూల్ అసిస్టెంట్/ లాంగ్వేజ్ పండిట్ లు పదోన్నతికి అర్హులు కానీ ఎవరైతే ముందుగా ఓరియంటల్ డిగ్రీ మరియు పండిట్ ట్రైనింగ్ పూర్తిచేసి తదుపరి అనుబంధంగా క్రింది స్థాయి అర్హతలయిన SSC / HSC / ఇంటర్మీడియట్ పొందినవారు అనర్హులు.
  •  డిపార్ట్మెంటల్ టెస్ట్స్ : పదోన్నతి పొందడానికి పై అర్హతలతో పాటు డిపార్ట్మెంటల్ పరీక్షలు కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియామకం అయిన వారికివయస్సు G.O.Ms.No.225  General Administration Dated: 18-5-1999 ప్రకారం 45సం.లు దాటితే మినహాయింపు కలదు. పదోన్నతి ద్వారా స్కూల్ అసిస్టెంట్ గా చేరిన వారికి వయస్సు 50సం.లు దాటితే డిపార్ట్మెంట్ టెస్ట్ లనుండి మినహాయింపు కలదు. 
మినహాయింపు వర్తించని వారు క్రింద చూపిన పరీక్షలలో పాస్ అవ్వాల్సి ఉంటుంది
  1. Departmental Test for Gazetted Officers of the Education Department (Paper Code 88, 97)
  2. Account Test for Executive Officers (Paper code 141)
  3. Special Language Test for the Officers of the Education Department in Telugu Higher Standard (Paper Code 37)
ఇంటర్మీడియట్ లో కానీ తత్సమాన స్థాయిలో కానీ డిగ్రీ లో కానీ తెలుగుని లాంగ్వేజ్ గా చదివిన వారికి పేపర్ కోడ్ -37 పరీక్ష నుండి మినహాయింపు కలదు. 

 స్కూల్ అసిస్టెంట్ గణితం : 

బ్యాచిలర్ డిగ్రీలో గణితం ప్రధాన సబ్జెక్టుగా కానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టులలో ఒకటిగా చదివి, గణితం మెథడాలజీతో బి.ఎడ్ పూర్తి చేసినవారు అర్హులు. 

 స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం : 

బ్యాచిలర్ డిగ్రీలో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలను ఆప్షనల్ సబ్జెక్టులుగా కానీ లేదా ఒకటి ప్రధాన సబ్జెక్టుగా రెండవది అనుబంధ సబ్జెక్టు లలో ఒకటిగా చదివి పాస్ అయి, ఫిజిక్స్/ ఫిజికల్ సైన్స్ / కెమిస్ట్రీ మెథడాలజీతో బి.ఎడ్ పూర్తి చేసినవారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం : 

బ్యాచిలర్ డిగ్రీలో బోటనీ మరియు జువాలజీలను ఆప్షనల్ సబ్జెక్టులుగా కానీ లేదా ఒకటి ప్రధాన సబ్జెక్టుగా రెండవది అనుబంధ సబ్జెక్టు లలో ఒకటిగా పాస్ అయి, బయోలాజికల్ సైన్స్ / నాచురల్ సైన్స్ / బోటనీ / జువాలజీ మెథడాలజీతో  బి.ఎడ్ పూర్తి చేసినవారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ : 

బ్యాచిలర్ డిగ్రీలో హిస్టరీ/ ఎకనామిక్స్/ జాగ్రఫీ/ పొలిటికల్ సైన్స్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ /సోషియాలజీ వేరే డిగ్రీతో బి.కం లేదా P.G సబ్జెక్టు లలో 2 ఆప్షనల్స్ గా లేదా ఒకటి ప్రధాన సబ్జెక్టుగా రెండవది అనుబంధ సబ్జెక్టు లలో ఒకటిగా పాస్ అయి, సోషల్ స్టడీస్ / జాగ్రఫీ / హిస్టరీ / సోషల్ సైన్స్ మెథడాలజీతో  బి.ఎడ్ పూర్తి చేసినవారు అర్హులు.

స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ : 

బ్యాచిలర్ డిగ్రీలో ఇంగ్లీష్ ని ప్రధాన సబ్జెక్టుగా లేదా ఆప్షనల్ సబ్జెక్టుగా లేదా M.A ఇంగ్లీష్ చదివి పాస్ అయి మరియు బి.ఎడ్ లో English / Post Graduate Certificate in Teaching of English / Post Graduate Diploma in Teaching of English మెథడాలజీతో  పూర్తి చేసినవారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్ తెలుగు : 

బ్యాచిలర్ డిగ్రీలో తెలుగు ని ప్రధాన సబ్జెక్టుగా లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టులలో ఒకటి లేదా M.A తెలుగు లేదా ఓరియంటల్ టైటిల్ లేదా తత్సమాన మరియు బి.ఎడ్ లో తెలుగు మెథడాలజీ లేదా పండిట్ ట్రైనింగ్ లేదా తత్సమాన పరీక్షా పాస్ అయినవారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్  హిందీ : 




స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ : 

బ్యాచిలర్ డిగ్రీలో ఉర్దూ ని ప్రధాన సబ్జెక్టుగా లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టులలో ఒకటి లేదా M.A ఉర్దూ లేదా ఓరియంటల్ టైటిల్ లేదా తత్సమాన మరియు బి.ఎడ్ లో ఉర్దూ మెథడాలజీగా లేదా పండిట్ ట్రైనింగ్ లేదా తత్సమాన అర్హతలు  వారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ : 

బ్యాచిలర్ డిగ్రీ మరియు ఫీజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ కలిగి ఉండాలి.

ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ : 

ఇంటర్మీడియట్ / HSC / SSLC / MPHSC సంబంధిత బోర్డు వారు నిర్వహించిన  పరీక్షా పాస్ అయి మరియు సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ లేదా డి.ఎడ్ లేదా తత్సమాన పరీక్ష పాసయినవారు అర్హులు. 

అప్రయత్నపదోన్నతులు - అర్హతలు - స్కేల్ వివరాలు :

ఒక క్యాడర్లో 6సం. ల అర్హత గల సర్వీస్ పూర్తిచేసినప్పుడు స్పెషల్ గ్రేడ్ (SG) ఇస్తారు ఆర్డినరీ స్కేల్ తరువాతి గ్రేడ్ స్కేల్ తో ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు.

ఒక క్యాడర్ లో 12సం. ల అర్హతగల సర్వీస్ పూర్తి చేసి తదుపరి ప్రమోషన్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉంటే ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో SPP-IA లో ఫిక్సేషన్ చెయ్యాలి. ఆస్కాలులో కనీస పే దాటి ఉంటే ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. తక్కువగా ఉంటే కనీస పే వద్ద ఫిక్సేషన్ చెయ్యాలి. 

ఒక క్యాడర్లో 18సం. ల అర్హత గల సర్వీస్ పూర్తిచేసి SPP-IA స్కేల్ పొందిన వారికి SPP-IB లో ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. 

ఒక క్యాడర్ లో 24సం. ల అర్హతగల సర్వీస్ పూర్తి చేసి రెండవ ప్రమోషన్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉంటే ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో ఒక ఇంక్రిమెంట్ ఇస్తూ SPP-II లో ఫిక్సేషన్ చెయ్యాలి. SPP-II పొందిన తరువాత ప్రమోషన్ పొంది 6సం.ల సర్వీస్ పూర్తిచేసిన పిదప స్పెషల్ గ్రేడ్ (SG) ఇవ్వరాదు. 

RPS 2015  అప్రయత్న పదోన్నతులకు సంబందించిన G.O.Ms. No. 38 Dt. 15.04.2015 ప్రకారం సర్వీస్ రూల్స్ నందు రెగ్యులర్ ప్రమోషన్స్ కై అర్హతలలో మినహాయింపు ఉన్నట్లయితే SPP-IA / SPP -II కి కూడా వర్తిస్తుందని ఉంది. "Where Service Rules are relaxed to enable regular promotion, they should be automatically extended to the Automatic Advancement Scheme for purposes of extending the benefit of SPP-IA / SPP-II" కానీ ఇదేవిధంగా RPS 2010  అప్రయత్న పదోన్నతులకు సంబందించిన G.O.Ms. No. 93 Dt. 03.04.2010 నందు కూడా ఉంది. "Where Service Rules are relaxed to enable regular promotion, they should be automatically extended to get the benefits under Automatic Advancement Scheme" ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు మెమో నం. 034408/248/PC.II/2011 Dt. 04.02.2012 ప్రకారం SPP-II కి 50సం.లు వయస్సు నిండినవారికి డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అవకుండా మినహాయింపుకు అనుమతించలేదు మినహాయింపు పొందేందుకు రాష్ట్ర శాఖ ప్రాథినిత్యం చేసింది. 


ZPGPF Slips

 ZPGPF Schedules :

స్థానిక సంస్థల ఉపాధ్యాయుల జడ్.పి.జి.పి.య.ప్ ఖాతాను ఆన్లైన్ లో చూసుకొవాలి అనే కోరిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుతూ వారి ఖాతాలను దాదాపుగా అన్ని జిల్లాలలో ఆన్లైన్ చేయడం జరిగింది వాటిని ఎలా చూసుకోవాలో ఒకసారి చూద్దాం. 

Steps to get ZPGPF Slips

1. క్రింది లింక్ పైన క్లిక్ చేసి Zillaparishad జిల్లాని ఎంపిక చేసుకోవాలి. 
2. మీ ZPGPF అకౌంట్ నెంబర్ ని నమోదు చేయండి. 
3. మీ పాస్వర్డ్ గా మీ ZPGPF అకౌంట్ నెంబర్ కి ముందు emp ని చేర్చండి.   
4. Enter Below Text లో క్రింద ఇచ్చిన కాప్చర్ నమోదు చేయండి 
5. Submit చేయండి 

Ex: 

 Employee's district : Nizamabad 
 Local GPF Number is 15467
 then the steps are 


Enter the details like shown below





ZPGPF Slips - click here

NSDL Pension Calculator

CPS వారికి ఎంత పెన్షన్ రావొచ్చు తెలుసుకోవడానికి ఒక అంచనా కోసం NSDL వారు పెన్షన్ calculator ని అందుబాటులో ఉంచారు. అందులో ఏమేమి వివరాలు నమోదు చేయాలి అనేది చూద్దాం. క్రింది ఇమేజ్ లా ఓపెన్ అవుతుంది అందులో రెడ్ కలర్ లో ఉన్నవాటిలో వివరాలు నమోదు చేయాలి. 









    • Age in Years అనే చోట ఉద్యోగంలోకి వచ్చేపుడు ఉన్న వయసుకి రెండు సంవత్సరాలు ఎక్కువ నమోదు చేయాలి ఎందుకంటే మన రిటైర్మెంట్ ఏజ్ 58సంవత్సరాలు కాభట్టి. ఇంకా మీరు రెండు సంవత్సరాలు కన్సాలిడేటెడ్ Pay పైన పనిచేస్తే ఇంకో రెడు సంవత్సరాలు అదనంగా మీ ఉద్యోగం వచ్చేనాటి వయసుని నమోదు చేయాలి. 
    • Expected Return on Investment అనే చోట వార్షిక పెరుగుదల ఎంత ఉండొచ్చు అనేది నమోదు చేయాలి. 2012-13 మినహా 10% శాతం కంటే ఎక్కువగా ఉంది. 
    • Percentage of Corpus Reinvested for Annuity అనే చోట కచ్చితంగా 40% చూపాలి ఎక్కువ invest   చేయడం మీ ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. 
    • Expected Annuity Rate అనే చోట వార్షిక పెరుగుదల ఎంత ఉండొచ్చు అనేది నమోదు చేయాలి. ఇప్పుడు దాదాపుగా 6% శాతం కంటే ఎక్కువగా ఉంది.

New Pension Calculator - NSDL - Click here  

Putta's New Pension Calculator and comparison with old Pension

Putta New Pension (CPS) Calculator

ఎలాంటి ప్రమోషన్ లను పరిగనలోనికి తీసుకోకుండా కేవలం 6,12,18 మరియు 24 సంవత్సరాల అప్రయత్న పదోన్నతులు పొందినట్టు పరిగణ లోనికి తేసుకుని ఇప్పటివరకు ఉన్న బేసిక్ పే లను మరియు డి. లను పరిగణలకు తీసుకుని తర్వాతి ప్రతి 6 నెలలు జనవరి మరియు జూలై నెలలో సరైన సమయంలో ఇచ్చినట్టుగా భావిస్తూ మిగితా సర్వీస్ కి ప్రతి సారి డి. 2.5% గా తీసుకోవడం జరిగింది. అదేవిదంగా RPS లు కూడా ప్రతి 5సం॥ లకు 15% పిట్మేంట్ ఇచ్చినట్టుగా తీసుకుని 40 %  (10 డి. లు 2.5% X 10 + 15% = 40% ) ను ఆయా RPS లలో బేసిక్ పే తో గణించి కొత్త పే లను తయారు చేసి గణనలోకి తీసుకునిఇంక్రిమెంట్ ను ప్రతి బేసిక్ పే పైన 2.5% గా బావిస్తూ బేసిక్ పే లను తయారు చేసి. ప్రతి నెలా ఉద్యోగి 10% CPS అమౌంట్ ని మరియు ప్రభుత్వం వారి 10% మ్యాచింగ్ గ్రాంట్ ని ఉద్యోగి PRAN ఎకౌంటు లో జమ చేసి సరాసరి ప్రతి ఏట అన్యుయల్ రిటర్న్స్ 9% (ఇప్పుడు దాదాపు 10% పైగా ఉంటున్నా 2013-14 సంవత్సరంలో 7% దిగువకు వచ్చింది కావున దాదాపు 9%) వచ్చినట్టు గా లెక్కకట్టడం జరిగినది. దాదాపుగా ఈవిదంగానే ఉంటుందని దీని ద్వారా కొత్త పెన్షన్ ప్రయోజనాలను పాత పెన్షన్ తో పోల్చి దాదాపుగా ఎంత నష్టమో ఒక అంచనాకు రావడానికి ఉపయోగపడుతుంది. 


మీరు డి.ఏ, పి.ఆర్.సి మరియు returns on CPS Investment percentage లను మీరు మార్చుకుని చూడండి. 
ఎన్నిరకాలుగా చూసినా 15% రిటర్న్స్ వచ్చినా కొత్త పెన్షన్ అనేది లాభం లేనటువంటిదే. ఉద్యోగికి ఎంతో నష్టమైన కొత్త పెన్షన్ విదానాన్ని తొలగించి పాత పెన్షన్ పునఃరుద్దరించేలా ప్రభుత్వం పై ఒత్తిడి  తెచ్చి సాదిన్చుకుందాం
ఇది ఒక అంచనాకోసమ్ మాత్రమే పూర్తిస్తాయిలో ఇదేవిధంగా ఉంటది అని చెప్పలేము. 

Putta CPS Pension Calculator and comparison with Old Pension - Click here 

How to Recover CPS PRAN Password, Solutions to Login Problems

మీరు Password ని మర్చిపోయార Login అవ్వలేకపోతున్నార పాస్వార్డ్ తిరిగిపొందడం ఎలాగో తెలుడుకుందాం. 

Step 1 : https://cra-nsdl.com/CRA అనే website ని ఓపెన్ చేసి Subscribers  విండో లోని Forgot Password పైన Click చేయండి

పాస్వర్డ్ తిరిగి పొందడానికి 4 రకాల అవకాశాలు ఉన్నాయి  

Option 1 : Reset Password Recovery

Step 2 :  మీరు ఇంతకు ముందు లాగిన్ అయినపుడు Secret Q/A నమోదు చెసుకున్నట్టయితె Reset Password Using Secret Question యొక్క రెడియల్ బటన్ నొక్కితే Reset Password విండో ఓపెన్ అవుతుంది User Id వద్ద మీ PRAN నంబర్ ని ఎంటర్ చేసి Submit బటన్ నొక్కాలి 























Step 3 : మీరు నమోదు చేసిన ప్రశ్న కి సమాదానం అడుగుతుంది మీరు నమోదు చేసిన సమాదానాన్ని Your Answer వద్ద ఎంటర్ చేయాలి 








Step 4 :  కొత్త Password ని 8 characters తగ్గకుండా ఒక అల్పభేట్ ఒక నుమేరిక్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేట్టు గా నమోదు చేసుకోవాలి ఎంపిక చేసుకున్న పాస్వర్డ్ ని Conform Password గా ఎంటర్ చేయాలి









మీ పాస్వర్డ్ విజయవంతంగా మార్చబడినది 

 Option 2 : Instant Reset I-Pin

Step 1 : మీరు సీక్రెట్ Question and Answer నమోదు చెసుకొని పక్షములో Forgot Password ఆప్షన్ నొక్కాక Instant Reset I Pin అనే ఆప్షన్ రేడియల్ బటన్ లో క్లిక్ చేయాలి, * గుర్తు ఉన్న ప్రశ్నలకు సమాదానం తప్పకుండా వ్రాయాలి.

PRAN నెంబర్ వ్రాయాలి, ఖాతాదారుడి పేరు PRAN card కోసం అప్లై చేసినప్పుడు రాసినవిదముగా First, Middle, Lat Name ఎంటర్ చేయాలి (కార్డు పైన మీ పేరు ఉన్నదానిలో స్పేస్ వచ్చె వరకు ఉన్న భాగాన్ని F irst Name గా నమోదు చేసి మిగితావి వదిలేసినా ఇబ్భంది లేదు) తర్వాత పుట్టినతేది వివరాలు, Email Id ని పెట్టుకోబోయే Password ని New Password లో మరియు Conform Password గా పైన చెప్పినట్టు పాస్వర్డ్ ని నమోదు చేసుకోవాలి. 
ఎంటర్ చేసాక Generate OTP పైన క్లిక్ చేయాలి ఖాతా తో రిజిస్టర్ అయిఉన్న మొబైల్ కి 6 digits పాస్వర్డ్ వస్తుంది ఆ వన్ టైం పాస్వర్డ్ ని అక్కడ ఎంటర్ చేయాలి











Step 2 : 
Reset I-Pin పాస్వర్డ్ Acknowledgement వస్తుంది తదుపరి అవసారాల కోసం మీవద్ద ఉంచుకోవాలి. 

Step 3 : మీరు ఇచ్చిన Email అడ్రెస్స్ కి మెయిల్ వస్తుంది, పై స్టెప్ లో నమోదు చేసుకున్న పాస్వర్డ్ తో లాగిన్ అవమంటది. మీరు నమోదు చేసుకున్న పాస్వర్డ్ తో లాగిన్ అవొచ్చు

Option 3 :

Option 2 లో Step 2 లోని * గుర్తు ఉన్న తప్పక నింపాల్సిన వివరాలు అన్ని నమోదు చేసాక, మీరు PRAN card కోసం apply చేసిన సందర్బం లోని mobile phone ఇప్పుడు మీవద్ద అందుబాటులో లేని పక్షములో Go to  Nodal Office పైన క్లిక్ చేయండి అక్కడ వచ్చిన Acknowledge పేపర్ ని ప్రింట్ తీసుకుని సంబందిత నోడల్ ఆఫీసు (DTO Office) ని సంప్రదించాలి

Option 4 : 

ఒక వేల ఆప్షన్ 2 అడుగుతున్న సమాచారానికి మీరు ఇస్తున్న సమాచారం సరిపోనప్పుడు Form S2 ని ఫిల్ చేసి I-Pin కోసం request పెట్టి సంబందిత  నోడల్ ఆఫీసు (DTO Office) ని సంప్రదించాలి

Form S2 for I-Pin  - Application Download