Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Service Rules - Promotions - AAS

పదోన్నతులు - అప్రయత్న పదోన్నతులు - అర్హతలు 

ఉపాధ్యాయులు పదోన్నతులు పొందడానికి,పదోన్నతులు పొందడం ఆలస్యం అయిన సందర్భంలో నిర్దిష్టకాల వ్యవధిలో అప్రయత్న పదోన్నతులు పొందడానికి కావలసిన అర్హతలు మినహాయింపులను గురించి చూద్దాం. 

పదోన్నతులు - అర్హతలు - మినహాయింపులు 

గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ - II :- 

బ్యాచిలర్ డిగ్రీలో ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ మరియు బి.ఎడ్ విద్యార్హతలు కలిగి ఉండాలి లేదా సాధారణ విద్యార్హతలయినా SSC మరియు 5సం. ల తదుపరి చదువులతో డిగ్రీ పట్టాపొంది, వృత్తిసంబంధ కోర్సులయిన బి.ఎడ్/ బి.పి.ఎడ్/ పండిత్ ట్రైనింగ్ / B.Com with another degree or P.G కల్గిఉన్నవారు అర్హులు.

SSC/ HSC/ MPHSC ఇంటర్మీడియేట్ పాసయి 5సం, 4సం, 3సం. ల ఓరియంటల్ టైటిల్ డిగ్రీ చదివి మరియు పండిట్ ట్రైనింగ్ పూర్తిచేసిన స్కూల్ అసిస్టెంట్/ లాంగ్వేజ్ పండిట్ లు పదోన్నతికి అర్హులు కానీ ఎవరైతే ముందుగా ఓరియంటల్ డిగ్రీ మరియు పండిట్ ట్రైనింగ్ పూర్తిచేసి తదుపరి అనుబంధంగా క్రింది స్థాయి అర్హతలయిన SSC / HSC / ఇంటర్మీడియట్ పొందినవారు అనర్హులు.
  •  డిపార్ట్మెంటల్ టెస్ట్స్ : పదోన్నతి పొందడానికి పై అర్హతలతో పాటు డిపార్ట్మెంటల్ పరీక్షలు కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియామకం అయిన వారికివయస్సు G.O.Ms.No.225  General Administration Dated: 18-5-1999 ప్రకారం 45సం.లు దాటితే మినహాయింపు కలదు. పదోన్నతి ద్వారా స్కూల్ అసిస్టెంట్ గా చేరిన వారికి వయస్సు 50సం.లు దాటితే డిపార్ట్మెంట్ టెస్ట్ లనుండి మినహాయింపు కలదు. 
మినహాయింపు వర్తించని వారు క్రింద చూపిన పరీక్షలలో పాస్ అవ్వాల్సి ఉంటుంది
  1. Departmental Test for Gazetted Officers of the Education Department (Paper Code 88, 97)
  2. Account Test for Executive Officers (Paper code 141)
  3. Special Language Test for the Officers of the Education Department in Telugu Higher Standard (Paper Code 37)
ఇంటర్మీడియట్ లో కానీ తత్సమాన స్థాయిలో కానీ డిగ్రీ లో కానీ తెలుగుని లాంగ్వేజ్ గా చదివిన వారికి పేపర్ కోడ్ -37 పరీక్ష నుండి మినహాయింపు కలదు. 

 స్కూల్ అసిస్టెంట్ గణితం : 

బ్యాచిలర్ డిగ్రీలో గణితం ప్రధాన సబ్జెక్టుగా కానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టులలో ఒకటిగా చదివి, గణితం మెథడాలజీతో బి.ఎడ్ పూర్తి చేసినవారు అర్హులు. 

 స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం : 

బ్యాచిలర్ డిగ్రీలో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలను ఆప్షనల్ సబ్జెక్టులుగా కానీ లేదా ఒకటి ప్రధాన సబ్జెక్టుగా రెండవది అనుబంధ సబ్జెక్టు లలో ఒకటిగా చదివి పాస్ అయి, ఫిజిక్స్/ ఫిజికల్ సైన్స్ / కెమిస్ట్రీ మెథడాలజీతో బి.ఎడ్ పూర్తి చేసినవారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం : 

బ్యాచిలర్ డిగ్రీలో బోటనీ మరియు జువాలజీలను ఆప్షనల్ సబ్జెక్టులుగా కానీ లేదా ఒకటి ప్రధాన సబ్జెక్టుగా రెండవది అనుబంధ సబ్జెక్టు లలో ఒకటిగా పాస్ అయి, బయోలాజికల్ సైన్స్ / నాచురల్ సైన్స్ / బోటనీ / జువాలజీ మెథడాలజీతో  బి.ఎడ్ పూర్తి చేసినవారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ : 

బ్యాచిలర్ డిగ్రీలో హిస్టరీ/ ఎకనామిక్స్/ జాగ్రఫీ/ పొలిటికల్ సైన్స్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ /సోషియాలజీ వేరే డిగ్రీతో బి.కం లేదా P.G సబ్జెక్టు లలో 2 ఆప్షనల్స్ గా లేదా ఒకటి ప్రధాన సబ్జెక్టుగా రెండవది అనుబంధ సబ్జెక్టు లలో ఒకటిగా పాస్ అయి, సోషల్ స్టడీస్ / జాగ్రఫీ / హిస్టరీ / సోషల్ సైన్స్ మెథడాలజీతో  బి.ఎడ్ పూర్తి చేసినవారు అర్హులు.

స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ : 

బ్యాచిలర్ డిగ్రీలో ఇంగ్లీష్ ని ప్రధాన సబ్జెక్టుగా లేదా ఆప్షనల్ సబ్జెక్టుగా లేదా M.A ఇంగ్లీష్ చదివి పాస్ అయి మరియు బి.ఎడ్ లో English / Post Graduate Certificate in Teaching of English / Post Graduate Diploma in Teaching of English మెథడాలజీతో  పూర్తి చేసినవారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్ తెలుగు : 

బ్యాచిలర్ డిగ్రీలో తెలుగు ని ప్రధాన సబ్జెక్టుగా లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టులలో ఒకటి లేదా M.A తెలుగు లేదా ఓరియంటల్ టైటిల్ లేదా తత్సమాన మరియు బి.ఎడ్ లో తెలుగు మెథడాలజీ లేదా పండిట్ ట్రైనింగ్ లేదా తత్సమాన పరీక్షా పాస్ అయినవారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్  హిందీ : 




స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ : 

బ్యాచిలర్ డిగ్రీలో ఉర్దూ ని ప్రధాన సబ్జెక్టుగా లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టులలో ఒకటి లేదా M.A ఉర్దూ లేదా ఓరియంటల్ టైటిల్ లేదా తత్సమాన మరియు బి.ఎడ్ లో ఉర్దూ మెథడాలజీగా లేదా పండిట్ ట్రైనింగ్ లేదా తత్సమాన అర్హతలు  వారు అర్హులు. 

స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ : 

బ్యాచిలర్ డిగ్రీ మరియు ఫీజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ కలిగి ఉండాలి.

ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ : 

ఇంటర్మీడియట్ / HSC / SSLC / MPHSC సంబంధిత బోర్డు వారు నిర్వహించిన  పరీక్షా పాస్ అయి మరియు సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ లేదా డి.ఎడ్ లేదా తత్సమాన పరీక్ష పాసయినవారు అర్హులు. 

అప్రయత్నపదోన్నతులు - అర్హతలు - స్కేల్ వివరాలు :

ఒక క్యాడర్లో 6సం. ల అర్హత గల సర్వీస్ పూర్తిచేసినప్పుడు స్పెషల్ గ్రేడ్ (SG) ఇస్తారు ఆర్డినరీ స్కేల్ తరువాతి గ్రేడ్ స్కేల్ తో ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు.

ఒక క్యాడర్ లో 12సం. ల అర్హతగల సర్వీస్ పూర్తి చేసి తదుపరి ప్రమోషన్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉంటే ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో SPP-IA లో ఫిక్సేషన్ చెయ్యాలి. ఆస్కాలులో కనీస పే దాటి ఉంటే ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. తక్కువగా ఉంటే కనీస పే వద్ద ఫిక్సేషన్ చెయ్యాలి. 

ఒక క్యాడర్లో 18సం. ల అర్హత గల సర్వీస్ పూర్తిచేసి SPP-IA స్కేల్ పొందిన వారికి SPP-IB లో ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. 

ఒక క్యాడర్ లో 24సం. ల అర్హతగల సర్వీస్ పూర్తి చేసి రెండవ ప్రమోషన్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉంటే ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో ఒక ఇంక్రిమెంట్ ఇస్తూ SPP-II లో ఫిక్సేషన్ చెయ్యాలి. SPP-II పొందిన తరువాత ప్రమోషన్ పొంది 6సం.ల సర్వీస్ పూర్తిచేసిన పిదప స్పెషల్ గ్రేడ్ (SG) ఇవ్వరాదు. 

RPS 2015  అప్రయత్న పదోన్నతులకు సంబందించిన G.O.Ms. No. 38 Dt. 15.04.2015 ప్రకారం సర్వీస్ రూల్స్ నందు రెగ్యులర్ ప్రమోషన్స్ కై అర్హతలలో మినహాయింపు ఉన్నట్లయితే SPP-IA / SPP -II కి కూడా వర్తిస్తుందని ఉంది. "Where Service Rules are relaxed to enable regular promotion, they should be automatically extended to the Automatic Advancement Scheme for purposes of extending the benefit of SPP-IA / SPP-II" కానీ ఇదేవిధంగా RPS 2010  అప్రయత్న పదోన్నతులకు సంబందించిన G.O.Ms. No. 93 Dt. 03.04.2010 నందు కూడా ఉంది. "Where Service Rules are relaxed to enable regular promotion, they should be automatically extended to get the benefits under Automatic Advancement Scheme" ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు మెమో నం. 034408/248/PC.II/2011 Dt. 04.02.2012 ప్రకారం SPP-II కి 50సం.లు వయస్సు నిండినవారికి డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అవకుండా మినహాయింపుకు అనుమతించలేదు మినహాయింపు పొందేందుకు రాష్ట్ర శాఖ ప్రాథినిత్యం చేసింది.