Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Leaves-Type of Leaves-General Principles

Leave :

సెలవు అనగా ఉద్యోగి/ఉపాధ్యాయులకు తన విధులకు సంబంధిత అధికారి/ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకుని హాజరు కాకుండా ఉన్నటువంటి కాలాన్ని సెలవు అంటారు. సెలవు వినియోగించుకోవాలి అంటే సెలవు మంజూరు చేయు అధికారంగల అధికారికి/ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాలి, సెలవులో వెళ్ళుటకు గల కారణాలు, ఏవిధమైన సెలవు కావాలి, ఎన్నిరోజులు కావాలి, ఒకవేళ అనారోగ్య పరిస్థితులలో సెలవుపై వెళ్ళినప్పుడు మెడికల్ సర్టిఫికెట్ జతపరచాలి. సెలవులో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటామో అడ్రస్ సెలవు పత్రములో నమోదు చేయాలి. 

F.R 67 ప్రకారం ఉద్యోగికి/ఉపాధ్యాయులకు సెలవు అనేది హక్కుగా భావించరాదు, కానీ సెలవు మంజూరు చేయు అధికారి సర్వసాధారణంగా ఉద్యోగి/ఉపాధ్యాయులకు కోరిన సెలవును నిరాకరించరాదు. పాఠశాల అవసరాల అసాధారణ పరిస్థితులలో కారణాలను రికార్డ్ చేసి ఉద్యోగి/ఉపాధ్యాయులకు కోరిన సెలవును నిరాకరించవచ్చు. 

ఉద్యోగి/ఉపాధ్యాయులకు ఏరకమైన సెలవు కావాలని కోరుకుంటారో అర్హత గల అలాంటి సెలవును మాత్రమే మంజూరు చేయాలి కానీ వారు అర్ధజీతం కావాలని కోరుకుంటే అతని కోరికని కాదని సంపాదిత సెలవు మంజూరు చేయడం నియమాలకు విరుద్ధం.             

Type of Leaves :

  • సాధారణ సెలవు (Casual Leave)
  • ప్రత్యేక సాధారణ సెలవు (Special Casual Leave)  
  • అర్ధజీతం సెలవు (Half Pay Leave)
  • కమ్యుటేడ్ సెలవు (Commuted Leave)
  • ఆర్జిత సెలవు (Earned Leave)
  • ప్రసూతి సెలవు (Maternity Leave)
  • పితృత్వ సెలవు (Paternity Leave) 
  • భయంకర వ్యాధులు సెలవు (Dread Diseases)  
  • అధ్యాయన సెలవు (Study Leave)
  • ఆసుపత్రి సెలవు (Hospital Leave)  
  • ప్రత్యేక అశక్తత సెలవు (Special Disability Leave) 
  • సంపాదించని సెలవు (Leave not Due)
  • అసాధారణ సెలవు (Extra Ordinary Leave)

Duty :

ఉద్యోగులు సెలవులలో ఉన్నప్పటికీ, లేదా ఇతర విధులు నిర్వహిస్తున్న కూడా విధుల్లో ఉన్నట్లుగానే పరిగణలోకి వస్తుంది అవి.

  • పబ్లిక్ హాలిడేస్ లలో, వెకేషన్ కాలములో మరియు ఆకస్మిక సెలవులలో (CL/SpCL)  విధులకు హాజరు కాకుండా ఉండడం. 
  • ఒకవేళ సెలవులలో వెళ్ళడానికి ముందు వచ్చిన లేదా సెలవు తరువాత వచ్చిన పబ్లిక్ హాలిడేస్ లను ప్రీఫిక్స్ /సఫిక్స్ చేసిన రోజులు మరియు అనుమతించిన సెలవు కాలాన్ని (రూల్ 4 (a) ప్రకారం)
  • Foreign Service లో పనిచేసిన కాలాన్ని 
  • సెలవు అనంతరం జాయినింగ్ కాలము    

Service : 

విధులలో ఉన్న రోజులు, అన్ని రకముల సెలవులు, EOL తో సహా సర్వీస్ గా పరిగణిస్తారు.  

  • రూల్ 4A  ప్రకారం ఆర్జిత సెలవు (EL) విధులలో ఉన్న కాలాన్ని పరిగణలోనికి తీసుకుని లెక్కిస్తారు.
  • రూల్ 13 (a) మరియు 18 (a) ప్రకారం సర్వీస్ లో పూర్తి అయిన సంవత్సరాల ఆధారంగా HPL అర్ద వేతన సెలవులను లెక్కిస్తారు.

Pay :

ఉద్యోగికి ప్రతినెల పొందే జీతభత్యములను అన్నిటిని కలిపి Pay అంటారు. రూల్ 4(d)(1) ప్రకారం సెలవులో వెళ్ళుటకు ముందు స్థిరమైన జీతం ఇతర భత్యాలు ఏవైతే ఉన్నాయో వాటినే సెలవు జీతం ఇవ్వవలసి ఉంటుంది.

సాధారణ ఆకస్మిక సెలవు (Casual Leave) Under FR 85

వెకేషన్ డిపార్ట్మెంట్ (వేసవి సెలవులు వాడుకొను డిపార్ట్మెంట్) లో పనిచేయు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొన్ని రకముల సెలవులు వేరుగా ఉంటాయి.  ఈ సెలవు G.O Ms.No. 52 Dt. 04-02-1981 ప్రకారం ఒక క్యాలెండర్ సంవత్సరంలో (జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు) 15రోజుల గరిష్ట పరిమితికి లోబడి అనుమతిస్తారు. 
  • ఆదివారాలు, ఇతర ప్రభుత్వ సెలవు రోజులు, ఐచ్చిక సెలవుదినాలు అన్ని కలిపి 10 రోజుల వరకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 
  • ఒక క్యాలెండరు సంవత్సరమునకు (అనగా 1 జనవరి నుండి 31వ డిసెంబర్ వరకు) 15 రోజుల ఆకస్మిక సెలవులు వాడుకొనవచ్చును. (జి.ఓ.యం.ఎస్. నం. 52 తేది 04-02-1981) 
  • ఒక క్యాలెండరు సంవత్సరంలో 7 రోజుల వరకు ప్రత్యేక ఆకస్మిక సెలవులు వాడుకొనవచ్చును (జి.ఓ.యం.ఎస్. నం. 47 తేది 19-02-1965) ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవులు పాఠశాలలో పనిచేయు బోధనేతర సిబ్బంది కూడా వాడుకొనవచ్చును. (డి.ఎస్.ఇ. ప్రో. ఆర్.సి. నం. 242-ఆర్3/63-15 తేది 18-11-1965)
  • పై సీఎల్స్ మరియు స్పెషల్ సిఎల్స్ కాకుండా PRTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో మన ప్రాతినిత్యం మేరకు మహిళా ఉపాధ్యాయులకు 5 రోజులు అదనంగా ఆకస్మిక సెలవులు వాడుకొనుటకు ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. (జి.ఓ.యం.ఎస్. నం. 374 తేది 16-03-1996) (ఇతర ఉద్యోగినిలకు ఈ సౌకర్యం లేదు). 
  • తాత్కాలిక ఉపాధ్యాయులు వారు డ్యూటీ చేసిన కాలమునకు లెక్కించి సిఎల్స్ అనగా సంవత్సర కాలములో 6 మాసాల డ్యూటీ మాత్రమే చేస్తే ఏడున్నర రోజులు సిఎల్స్ మరియు మూడున్నర రోజుల స్పెషల్ సిఎల్స్  ఇవ్వాలి. 
  • ఆకస్మిక సెలవులు, ఆదివారములు, ప్రభుత్వసేలవులు అన్ని కలిపి 10 రోజులకు మించరాదు. అలా మించినచో అతడు కోరిన (Other than CLs) ఆకస్మికేతర సిఎల్ గా పరిగణించి అర్హత గల కోరిన సెలవును మంజూరి చేయాలి. 
  • ఆకస్మిక సెలవులను వేసవి సెలవులకు, జాయినింగ్ కాలమునకు 10 రోజులు మించిన టర్మ్ హాలిడేస్ లకు కలిపి తీసుకొనరాదు. 
  • వినతి పత్రము లేనిది ఆకస్మిక సెలవు మంజూరి చేయరాదు. 
  • G.O Ms.No. 112 తేదీ 03.06.1966 ప్రకారం సగం రోజు కూడా ఆకస్మిక సెలవు మంజూరు చేయవచ్చు. 
  • ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకుని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పై అధికారుల అనుమతితో ఈ సెలవును ఉపయోగించుకోవాలి.   
  • ప్రతి పాఠశాలలో సిఎల్ అకౌంట్ రిజిస్టర్ నిర్వహించాలి. 
  • ఒక నెలలో (3) రోజుల వరకు ఆలస్యముగా వచ్చినచో ఒక రోజు సిఎల్ గా పరిగణించాలన్న నిబంధన ఉపాధ్యాయులకు వర్తించదు. ప్రతి ఉపాధ్యాయుడు/ ప్రధానోపాధ్యాయుడు విధిగా ప్రార్థన సమయంలో హాజరు కానివారు 1/2 రోజుకు ఆకస్మిక సెలవుకై వినతి పత్రము సమర్పించి డ్యూటీ చేయాలి. 
  • ధర్నాలకు, సమ్మెలలో పాల్గొనడానికీ సాధారణ సెలవు మంజూరు చేయకూడదు.
      

0 comments: