Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Compassionate Appointments

ప్రభుత్వం G.O.Ms.No 1005 Employment & Social Welfare Dept. dt. 27.12.1974 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ లో ఉండగా చనిపోతే, ఉద్యోగిపైన ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యుల పోషణ కోసం అర్హత కలిగి ఉన్న కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం చేయడానికి అనుమతించడం జరిగింది. Govt. Memo No. 58226/Ser-A/2000-2 GAD, dt. 01.05.2001 ప్రకారం కారుణ్య నియామకం పొందిన వ్యక్తి ఇతర కుటుంబ సభ్యుల పోషణ బాధ్యత చూడాలి కానీ అలా చూడని పక్షాన వారిని ఉద్యోగం నుండి తొలగించు అధికారం శాఖాధిపతులకు ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ఇన్వాలిడేషన్ - కారుణ్య నియామకాలను సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం G.O.Ms.No 661 G.A.(Ser.- G) department, dt. 23.10.2008 ద్వారా పునరుద్ధరించారు. 
  • మరణించిన ఉద్యోగి కుటుంబసభ్యులలో ఎవరూ సంపాదన పరులు లేనప్పుడు కుటుంబ సభ్యులలో ఒకరు కారుణ్య నియామకానికి అర్హులు. వీరికి నిర్ణిత వయసు (All Casts Upper age Limit for Spouse is 45 years as on application submitted for Compassionate Appointment vide G.O.Ms.No. 144 G.A. (Ser.-D) dept. dt. 15.06.2004) కలిగి నిర్ణిత విద్యా అర్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్ కు తత్సమాన స్థాయి మించని లేదా తక్కువ స్థాయి ఉద్యోగానికి అర్హులు. 
  • ఉద్యోగి చనిపోయిన తేదీ నుండి ఒకసంవత్సరం లోపల కారుణ్య నియామకం కోసం అప్లై చేసుకోవాలి. 
  • ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నా, 7సంవత్సారాలకు మించి కన్పించకుండా పోయిన ఉద్యోగిపై  ఆధారపడిన కుటుంబసభ్యులు కారుణ్య నియామకాలకు అర్హులే. 
  • అవివాహఉద్యోగి చనిపోతే వారి కుటుంబంలో ఎవరు సంపాదన పరులు లేకపోతే తమ్ముడికి కానీ చెల్లికి కానీ కారుణ్య నియామకానికి అర్హులు. 
  • ఉద్యోగి చనిపోయిన లేదా మెడికల్ ఇన్వాలిడేషన్ జరిగిన వారి పిల్లలు 16 సంవత్సరాలు ఉన్న ఉద్యోగానికి అర్హులే, వీరికి లాస్ట్ గ్రేడ్ ఉద్యోగంలో తాత్కాలికంగా నియామకం చేసి 18 సంవత్సరాలు నిండినాక పూర్తిస్థాయి నియామకం చేస్తారు.

కారుణ్య నియామకానికి అర్హులైన కుటుంబ సభ్యులు ఎవరు ?

చనిపోయిన ఉద్యోగి Spouse ఉద్యోగానికి అర్హతలు కలిగి ఉంటే వారికి (విధవరాలు ఉద్యోగం చేయాలనుకుంటే వారి స్వంత జిల్లాలో అయినా కానీ చనిపోయిన ఉద్యోగి పనిచేసిన జిల్లా అయినా కానీ ఎక్కడైతే క్షేమంగా ఉంటారో అక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులకు సిక్స్ పాయింట్స్ ఫార్ములాకు లోబడి నియమించవచ్చు Circular Memo NO. 28967/Ser. G/2004-1 dated 5-6-2004.) ఒకవేళ వారికి ఉద్యోగం చేయడం ఇష్టంలేని పక్షమున వీరు చూచించిన ఇతర కుటుంబ సభ్యులలో ఒకరు. 
  • కూతురు/ కుమారుడు 
  • ఆధారపడి జీవిస్తున్న విధవరాలైన కూతురు 
  • దత్తతీసుకున్న పిల్లలు (Adopted Children) 
  • పెళ్ళైన కూతురు ఒక్కరు మాత్రమే సంతానంగా ఉంటే 
  • పెళ్ళైన కూతుళ్లు ఇద్దరు ఉంటే అందులో ఒకరికి 
నోట్ : కారుణ్య నియామకం కోసం అప్లై చేసుకున్న వారి వయస్సు ఉద్యోగం పొందేనాటికి గరిష్ట వయస్సును దాటినా పర్వాలేదు, వారు ఉద్యోగం కోసం అప్లై చేసే రోజును మాత్రమే పరిగణలోకి తీసుకుని వీరికి ఉద్యోగం ఇవ్వాలి. 

a social security scheme to provide appointment up to or equal to or less than the category of Junior Assistant to the spouse or dependent Government servant

ఎక్స్గ్రేషియా (Exgratia) :

ఒకవేళ ఉద్యోగం చేయడానికి భార్య / భర్త కి ఇష్టం లేక లేదా అర్హతలు లేక పోయిన సందర్భములో కానీ పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు కానీ చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఎవరు సంపాదనపరులు లేనప్పుడు కొన్ని షరతులకు లోబడి G.O.Ms.No. 166 GA (Ser.-A) GAD dt. 31.03.2005 read with G.O.Ms.No. 59 GA (Ser.-A) GAD dt. 05.02.1993 ప్రకారం ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా (Exgratia) చెల్లిస్తారు.
  • IV class employees           Rs. 40,000/-
  • Non Gazetted Employees  Rs. 60,000/-
  • Gazetted Employees         Rs. 80,000/-

షరతులతో కూడిన కారుణ్య నియామకాలు : 

జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన స్థాయి పోస్టుకోసం కావలసిన కనీస నిర్దేశిత విద్యార్హతలులేని పక్షములో G.O.Ms.No 577 GA.(Ser.-A) Dept. Dt. 29.10.1993 as amended in G.O. G.O.Ms.No. 76 GA (Ser.-A) Dept. Dt. 16.03.1996 ప్రకారం గ్రాడ్యుయేషన్ అర్హతల కోసం 5 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కోసం 3 సంవత్సరాలు. G.O Ms.No. 612 G.A(Ser.-A) Dept. Dt. 330.10.1991 ప్రకారం టైపింగ్ కోసం 2 సంవత్సరాలు అనుమతినిస్తారు.  G.O.Ms.No. 151 GA (Ser.-G) Dept. Dt. 22.06.2004 ప్రకారం కనీస నిర్ధేశిత అర్హతలు  పొందిన తేదీ నుండి మాత్రమే సర్వీస్ క్రమబద్దీకరించబడుతుంది. 

నోట్ : కారుణ్య నియామకం  ద్వారా ఉంద్యోగం పొందిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యుల పోషణ భాద్యత విధిగా చూడాలి, నిర్లక్ష్యం చేసిన వారిని Govt. Circular Memo No. 58226-A/2002-2 G.A. (Ser.-A) department Dt. 01.05.2001 ప్రకారం ఉద్యోగంలో నుండి తొలగించే అవకాశం ఉంది.    

కారుణ్య నియామకాల కోసం కావలసిన సర్టిఫికెట్లు :

కారుణ్య  నియామకం కోసం దరఖాస్తు చేసే సమయంలో అప్లికేషన్ తో పాటు జత చేయాల్సిన పత్రాలు. 

  • Death Certificate
  • Affidavit Certificate ( No Objection Certificate)
  • Individual Application
  • Family Members Certificate
  • Employment Card
  • Qualification Certificate
  • SSC Certificate
  • Bonafide Certicate
  • No Earning Certificate
  • Residential Certificate
  • Caste Certificate (other than OC)
  • No Property Certificate   
  • Financial Status Certificate (by RDO)
మరణించిన ఉద్యోగి పనిచేసిన కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి.

నోట్ : కారుణ్య నియామకం ద్వారా ఉంద్యోగం పొందిన వ్యక్తి Govt. Circular Memo No. 40130/Ser.-G/2009-1 GA (Ser.-A) Dept. Dt. 18.06.2010 ప్రకారం నిర్దేశిత నియమ నిబంధనల మేరకు  పునర్వివాహం చేసుకున్నా కూడా ఉద్యోగంలో కొనసాగవచ్చు. 

మెడికల్ ఇన్వాలిడేషన్ పైన రిటైర్మెంట్ కి అనుమతించే వ్యాధులు :

  • పక్షవాతం
  • అంతిమ దశలో ఉన్న మూత్ర పిండముల వ్యాధి  
  • అంతిమ దశలో ఉన్న కాలేయ వ్యాధి 
  • క్యాన్సర్ వ్యాధి 
  • మానసిక వ్యాధి
  • పార్కిన్సన్ వ్యాధి 
మెడికల్ ఇన్వాలిడేషన్ పైన రిటైర్మెంట్ కావాలి అనుకునే వారు కమిటీకి పంపవలసిన వివరములు :
  • మెడికల్ ఇన్వాలిడేషన్ పొందే ఉద్యోగి పేరు 
  • ఉద్యోగి పనిచేసున్న శాఖా హోదా స్కేల్ అఫ్ పే 
  • క్రమ శిక్షణ చర్యలు పెండింగులో ఉన్నాయా 
  • ఉద్యోగి సర్వీస్ రెగ్యులర్ అయ్యిందా 
  • పుట్టిన తేదీ 
  •  పుట్టిన తేదీ ప్రకారం ఉద్యోగ విరమణ తేదీ 
  • వ్యాధి వివరములు 
  • ఆ వ్యాధి G.O.Ms.No 661 GAD dt. 23.10.2008  ప్రకారం ఉందా 
  • వ్యాధి చికిత్స కోసం ఉద్యోగి సెలవు పై ఉన్నారా ఉంటె ఆ వివరాలు 
  • మెడికల్ బోర్డువారి సిపార్సులు 
  • శాఖా పర సిపార్సులు 
మరణించిన ఉద్యోగి పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ ఆర్ధిక పరిస్థి దృష్ట్యా కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం చేస్తున్న సందర్భంలో కొంతవరకు స్థిరాస్తి, భూములు, ఇల్లు తదితరములు ఉన్నప్పటికీ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబ జీవనోపాధికి సరిపడ లేవని కారుణ్య  నియామకాలు చేయు అధికారి భావిస్తే కుటుంబంలో ఒకరికి Govt. Memo No. 535/Ser.-A/91-1/GA (Ser.-A) Dept. dt. 17.12.1979 ప్రకారం ఉద్యోగం ఇవ్వవచ్చు.
















15 comments:

Naresh said...

Namaste sir,
To whom the compassionate appointment application to be submit in case of death of the teacher?

Putta Srinivas Reddy said...

To DEO through DDO of the deceased employee (MEO incase of PS/UPS or HM incase High school)

Anonymous said...

Namaste sir compassionate ground lo 5 years degree condition pain appointment ainan vaariki oka year tarvatha oka increment ivvavacha ?

Arunshalini said...

Sir my father died when iwas 13.
So that my mother got the job . Iam only daughter to my parents and i got married recently due to my mother health condition. But day to day my mother got ill . She was unfit for the job said by the doctors in medical. My husband is a provate employee. Still iam dependent on my mother
Can i get the job of my mother in medical invalidation . To look after her. Plz inform sir

kvinodkumarpandu@gmail.com said...

Sir మా నాన్న 2009 లో govt job చేస్తూ చనిపోయారు .

కానీ మాకు ఇప్పుడు 2019 లో ఒకరికి జాబ్ ఇస్తున్నారు.
మా నాన్న job కోసం మేము 10 years wait చేసాము.


ఇప్పుడు నా వయసు 24 years సార్.
2009 లో నా వయసు 14 years సార్.

ఇప్పుడు జాబ్ ఇస్తున్నారు కాబట్టి నేను మా నాన్న జాబ్ కి eligible అవుతాను కదా సార్.
Help me......

Unknown said...

I appointed as Junior assistant on compassionate appointment in government Junior college on july 2015 with conditional of 5 years for Degree qualification I have completed Degree on June 2016 which date I eligible for Annual Grade Increment. RJDIE Warangal has issued the proceedings to eligible for Annual Grade Increment on Date of Qulified i.e. 01.07.2020. But STO Choutuppal has not pass the bill and he says your eligible for AGI after completion of One year from the qualified date kindly give a clarification for this regard.
Thank You Sir
K.Venkat Reddy

Sainath said...

when you complete one year of service from the date of appointment 1st AGI Is Sanctioned for the One year Completion in service, and When 2nd AGI is Sanctioned only after completion of Probation period.and the Degree is doesn't Matter in Sanctioning AGI

Sainath said...

@Arunshalini In Which Post your Mother was Working

PRASHANTH said...

I was 9 years old when mother died ( 2002). I didn't applied for the appointment for the compassionate job within year as I was child . Now my age is 28 years ,how can I apply for the job . Is there any possibility to get job
. She worked as SGTeacher . Sir kindly answer me

Unknown said...

Gd evng sir... మా నాన్న గారు కరోనాతో 05/08/2020మరణించారు.... నేనూ కారుణ్య నియామం కొరకు applay చేశాను... 27/02/2021 ఒక కౌన్సిలింగ్ కూడా attend అయ్యాను.....మళ్ళీ 30/06/2021నీ కౌన్సిలింగ్ కి నన్ను అటెండ్ కానివ్వలేదు.... నా age మా నాన్న చనిపోయిన నాటికి 38 years & 21 days ఉంది.... నీకూ 21days ఎక్కువగా ఉంది అని అంటున్నారు.... Am ts state.... Plz help sir

Unknown said...

Sir I appointed as junior assistant cum typist in apswreis on 16.3.2015 and my qualifications at the time of appointment are BSc degree and pgdca.
But my appointment authority gave a condition in my order for two years that must qualify higher type telugu or english or skilltest conducted by headoffice with in two years from my joining.
I have been passed skilltest on 26.8.2019 and regularized my services from date of skilltest passing.
Is it true? Please reply

Unknown said...

Regularization date of exam pass kj aithe probation eppatiki avutundi?

Unknown said...

Sir my brother covid death he was unmarried iam married who is elegeble compossanat appointment please explain


Unknown said...

Sir my father died in 1995 at that time I m minor.i m the 2nd daughter with out no job,my husband also has no job.am i eligible to get job after 27 years of my father's death.




Hi said...

సర్ మా అక్కయ్య వాళ్ళ అత్త గారు చనిపోయి వాళ్ళ చిన్న అబ్బాయి గారికి ఉద్యోగం ఇచ్చారు వారు మిగతా మా బావ గారు అయిన పెద్ద అబ్బాయి గారికి ఎలాంటి ఆర్ధికంగా, ఉద్యోగం పరంగా ఎలాంటి లాభాలు పంచక పోగ చాలా వేధింపులకు గురి చేస్తున్నారు

ఇటీవలే మా బావ గారు కూడా చనిపోయారు మా అక్క వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది దీనికి సంబంధించిన వివరాలు, పరిష్కారాలు సూచించగలరని కోరుకుంటున్న.