Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

Special Casual Leave

ప్రత్యేక ఆకస్మిక సెలవులు (స్పెషల్ క్యాజువల్ లీవ్)

సాధారణ ఆకస్మిక సెలవులకు అదనంగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొందరు ఉద్యోగులకు, విశిష్ట వ్యక్తులకు ప్రత్యేక ఆకస్మిక సెలవులను సైతం ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవులను స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చే వీలుంది. 
  • ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో భాగంగా ఏదైనా భారత ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ న్యాయస్థానాలలో సాక్ష్యం చెప్పవలసి వచ్చినపుడు కోర్టులో హాజరైన దినాలకు, ఆ హాజరుకు అవసరమైన ప్రయాణానికి తగినన్ని రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చే వీలుంది. 
  • కుటుంబ సంక్షేమ కార్యక్రమాల పరిధిలో వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకునే రాష్ట్ర ప్రభుత్వ పురుష ఉద్యోగులు, 6 పనిదినాలు స్పెషల్ క్యాజువల్ లీవ్ పొందేందుకు అర్హులు. (జి.ఓ.యం.ఎస్.నం. 257 ఫైనాన్స్ & ప్లానింగ్ తేది 05-01-1981) ఒకసారి చేయించుకున్న వేసెక్టమీ ఆపరేషన్ విఫలమైన పక్షంలో, తగిన వైద్య అధికారుల నుంచి ధ్రువీకరణ పొంది, తిరిగి రెండవ వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న పరిస్థితులలో ఆఉద్యోగి, తిరిగి 6 పనిదినాలు స్పెషల్ క్యాజువల్ లీవ్ గా పొందవచ్చు. 
  • మహిళా ఉధ్యోగులు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నట్టయితే, వారికి 14 రోజులకు మించని స్పెషల్ క్యాజువల్ లీవ్ లభిస్తుంది. (జి.ఓ.యం.ఎస్.నం. 124 తేది 13-04-1982) ఒకసారి చేయించుకున్న ట్యూబెక్టమీ ఆపరేషన్ విఫలమైన పక్షంలో తగిన వైద్య అధికారుల నుంచి ధ్రువీకరణ పొంది, తిరిగి రెండవ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న పరిస్థితులలో ఆ మహిళా ఉద్యోగిని, తిరిగి 14 పనిదినాలకు మించని కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్ గా పొందవచ్చు. 
  • కుటుంబ నియంత్రణ కోసం మహిళా ఉద్యోగినులు కాపర్ -టీ లేదా లూప్ వంటి ఇంట్రాయుటెరస్ డివైస్ (ఐ.యు.డి) లను వేయించుకున్న పక్షంలో వారికి అలా వేయించుకున్న పక్షంలో వారికి అలా వేయించుకున్న రోజుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ లభిస్తుంది. (జి.ఓ.యం.ఎస్.నం. 128 తేది 13-04-1982) 
  • మగ ఉద్యోగుల, తమ భార్య ట్యూబెక్టమీ ఆపరేషన్ మొదటిసారి చేయించుకున్నప్పుడు లేదా మొదటిసారి చేయించుకున్న ఆపరేషన్ విఫలమై, రెండవసారి చేయించుకుంటుంన్నపుడు తగిన ధ్రువపత్రాలను జతచేసినట్లయితే, 7 రోజులవరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ లభిస్తుంది. దీనికోసం దరఖాస్తు చేస్తున్నపుడు తన భార్య ఆరోగ్యం కోలుకునే నిమిత్తం తన సహాయంగా ఉండవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొనాల్సిన అవసరం లేదు. (జి.ఓ.యం.ఎస్.నం. 802 తేది 21-04-1972)
  • మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (యం.పి.టి) లేదా అబార్షన్ చేయించుకున్న తరువాత మహిళా ఉద్యోగిని గనుక స్పాలింగేక్టమీ చేయించుకున్నట్లయితే వారికి 14 రోజులకు మించని స్పెషల్ క్యాజువల్ లీవ్ లభిస్తుంది. (జి.ఓ.యం.ఎస్. నం. 275 ఫైనాన్స్ &ప్లానింగ్ తేది15-05-1981)  
  • మగ ఉద్యోగికి తన  భార్య స్పాలింగేక్టమీ చేయించుకుంటున్నపుడు తగిన ధ్రువపత్రాలను సమర్పించినట్లయితే 7 రోజుల వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ లభిస్తుంది. 
  • కొన్ని సందర్భాలలో ట్యూబెక్టమీ లేదా వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నప్పుడు, అనుకోని వైద్యపరమైన ఇబ్భంధులు ఎదురు కావచ్చు. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం ఉద్యోగులు మామూలు కన్నా ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండవలసి రావచ్చు. ఈ పరిస్థితులలో వారు ఆసుపత్రిలో గడిపినంత కాలానికి, తగిన వైద్యాధికారి ఇచ్చే ధ్రువీకరణ పత్రం జత చేసినట్లయితే వారికి ఆ కాలానికి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వబడుతుంది. 
  • ఉద్యోగి చేయించుకున్న ట్యూబెక్టమీ లేదా వేసెక్టమీ శస్త్రచికిత్స  విఫలమైనప్పుడు ఆసుపత్రిలో ఉండవలసిన ఆవసరం లేకపోయినా, ఉద్యోగ విధులకు హాజరు కాలేని పరిస్థితి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులలో సైతం స్పెషల్ క్యాజువల్ లీవ్ అనుమతించడం జరుగుతుంది. 
  • కుటుంబ నియంత్రణ కోసం చేయించుకున్న శస్త్రచికిత్స తరువాత, తిరిగి ఏ కారణాల వల్లనైనా రీక్యాన్సలైజేషన్ చేయించుకున్నట్లయితే, దీనికి హాస్పిటల్ లో  రోజులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ 21 రోజులకు మించకుండా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రీక్యాన్సలైజేషన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, లేదా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రిలో కానీ జరిగి ఉండాలి. ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకున్న పక్షంలో, ఆ ప్రయివేట్ ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి రీక్యాన్సలైజేషన్ కోసం అనుమతి, గుర్తింపు ఉంది ఉండాలి.
గమనిక : కుటుంబ నియంత్రణ కోసం చేయించుకున్న శస్త్రచికిత్సలకు ప్రోత్సాహకంగా ఇచ్చే ప్రత్యేక ఆకస్మిక సెలవులు 
  1. ఆపరేషన్ చేయించుకున్న రోజు నుంచే ప్రారంభమవుతుంది. 
  2. వీటికి ముందు, తరువాత ఇచ్చే పబ్లిక్ సెలవులు, ఐచ్చిక సెలవులను వీటిలో జత చేసుకోవచ్చు. 
  3. సాధారణ ఆకస్మిక సెలవులను వీటితో జత చేసే వీలులేదు.  
  4. సాధారణ సెలవులతో కానీ జాయినింగ్ టైంతో కానీ వేరే ఇతర సెలవులతో కానీ వీటిని కలిపి వాడుకునే వీలులేదు.
  • క్రీడలలో పాల్గొనే ఉద్యోగులకు  క్యాలండర్ సంవత్సరంలో 30 రోజులకు మించకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వబడుతుంది. అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రాముఖ్యం గల క్రీడోత్సవాలలో పాల్గొనేందుకు జాతీయ స్థాయి క్రీడా సంస్థలు ఎంపిక చేసిన బృందంలో సభ్యులుగా ఉన్నప్పుడే ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ అనుమతించబడుతుంది. (జి.ఓ.యం.ఎస్.నం.295 ఫైనాన్స్ తేది 14-09-1964) 
  • ప్రోగ్రసివ్  రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పి.ఆర్.టి.యు) తరపున జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఒక క్యాలండర్ సంవత్సరములో 21 రోజులకు మించకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వబడుతుంది. (జి.ఓ.యం.ఎస్.నం 638 తేది 30-12-1983) 
  • రక్తదానం చేసే ఉద్యోగులకు, తగిన వైద్యాధికారుల నుంచి సర్టిఫికెట్ జత చేసిన పక్షంలో, రక్తదానం చేసిన ఒక్కరోజుకు ప్రత్యేక ఆకస్మిక సెలవు ఇవ్వబడుతుంది. ఈ లీవ్ రూల్స్ ఎయిడెడ్ విద్యాసంస్థలకు కూడా వర్తిస్తాయి. (G.O.Ms.No. 137 M&H(EL) dt. 30-12-1983)

0 comments: