Union News (సంఘ సమాచారం)

Congratulations to Newly appointed Teachers

CPS Basic Information

ఉద్యోగ  విరమణానతరం ప్రతినెల ఉద్యోగికి/ తనపైన ఆదారపడిన వారికి చెల్లించే జీవన బృతికి అప్పటివరకు ఉన్న విదానం లో కాకుండా ప్రభుత్వం 2001-02 బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఉద్యోగ విరమణానంతరం ఇచ్చే పెన్షన్లో మార్పు చేయడానికి బి.కె భట్టాచార్య నేతృత్వంలో హైపవర్ కమిటిని ఏర్పాటు చేసి, వారి ప్రతిపాధనలను  తేది 23.08.2003 రోజున ఆమోదించి తేది 01.01.2004 నుండి  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉద్యోగి వాటా ఏమి చేల్లించకుండా పొందే పెన్షన్ కి బదులు ఉద్యోగి వాటాగా బేసిక్ పే మరియు డి. మొత్తం పై 10% నిధిని జమ చేస్తే అంతే మొత్తంలో ప్రభుత్వ వాటా చెల్లించేలా నూతన విదానాన్ని అమలులోకి తెచ్చింది పెన్షన్ నిదిని National Pension System (NPS) Trust వారు National Securities Depository Limited (NSDL) ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టి తదుపరి పదవీ విరమణ సమయంలో సర్వీస్ మొత్తం లో ఉద్యోగి మరియు ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణిత శాతంలో Anuity ప్లాన్ లలో పెట్టి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు. దీనికోసం Pension Fund Regulatory and Development Authority (PFRDA) ను ఏర్పాటు చేసారు నూతన పెన్షన్ విదానాన్ని మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఆర్ధిక పరిస్థితిని భట్టి అమలు చేయొచ్చు అని చెప్పారు.  

కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే తమిళనాడు మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ఠ్రాలు నూతన పెన్షన్ అమలు చేస్తుండగా, కేవలం పచ్చిమ బెంగాల్ మరియు త్రిపురా రెండు రాష్ఠ్రాలు మాత్రమే పాత పెన్షన్ ఇస్తున్నాయిమిగితా అన్ని రాష్ఠ్రాలు వేరు వేరు తేదిలలో నుండి ఈవిదానాన్ని అమలుచేస్తూ National Pension System (NPS) Trust లో చేరి తమ రాష్ట్ర ఉద్యోగుల పెన్షన్ నిదిని NSDL  ద్వారా షేర్ మార్కేట్ లో పెడుతున్నారు. కాని తమిళనాడు రాష్ఠ్రం CPS ముందునుండి అమలు చేస్తున్నా వారి నూతన పెన్షన్ నిదిని NPS Trust లో చేరని కారణంగా వారి వద్దే ఉన్నాయి. తమిళనాడు రాష్ఠ్ర ఉద్యోగ సంఘాల నిరసనల మేరకు పాత పెన్షన్ కొనసాగించడానికి ఉన్న సాద్యాలను పరిశీలించడానికి ఆరాష్ఠ్ర ప్రభుత్వం హైపవర్ కమిటి ని ఏర్పాటు చేసారు. త్వరలో వారికి పాత పెన్షన్ పునరుద్దరిస్తారని ఆశిస్తూ... అది ఇతర రాష్ఠ్రాల వారికి మార్గాధర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాము నూతన పెన్షన్ విధానాన్ని అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జి. 653, 654, 655 తేది 22.09.2004 ప్రకారం తేది 01.09.2004 నుండి ఉద్యోగంలో చేరిన వారికి కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం (CPS) ని అమలు చేస్తూ, GPF సదుపాయాన్ని తీసివేసారు, బేసిక్ పే మరియు డి. మొత్తం పై 10% ఉద్యోగివాటాగా అంతే మొత్తంలో ప్రభుత్వ వాటాను కలిపి సి.పి.యస్ ఖాతాకు పెన్షన్ నిదిగా జమచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా PFRDA వారు NPS లో కొనసాగుతారా అని అడగగా అందులోనే కొనసాగుతామని 


ఖాతా నిర్వహణకు దాదాపు 2009 వరకు ట్రెజరీ ఐడి పై కట్ చేశారు తదుపరి CPS ఖాతా నిర్వహణ కు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA), నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) రూపొందించిన పెర్మనెంట్ రిటైర్మెంట్ ఎకౌంటు (PRAN) ను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఖాతా నెంబర్ గా జారి చేస్తారు. CPS నిదిని SBI పెన్షన్ ఫండ్ స్కీం నందు 34%, LIC పెన్షన్ ఫండ్ స్కీం నందు 34% మరియు UTI పెన్షన్ ఫండ్ స్కీం నందు 32% గా పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 2010 సంవత్సరం వరకు జీతంలో కట్ అయిన అమౌంట్ మరియు మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పటివరకు వారి వారి ఖాతా లలో జమ కాలేదు. దీనికోసం PRTU -TS రాష్ఠ్ర శాఖ ప్రభుత్వానికి, ఆర్థికశాఖకి విన్నవించడం జరిగింది. జి. 226 తేది 29.09.2011 ప్రకారం 01.04.2009 నుండి 31.03.2011 వరకు మరియు జి. 142 తేది 17.06.2013 ప్రకారం 01.04.2011 నుండి సి.పి.యస్ లబ్ధిదారుడి వాటా మరియు ప్రభుత్వ వాటా రెండింటి మొత్తాన్ని ఖాతాలో జమ చేసేంత వరకు జరిగిన ఆలస్యానికి సంవత్సరానికి 8% చొప్పున వడ్డి ఖాతా దారుడి ఖాతాలో జమచేయాలి.
Posted in: