ఆదాయపు పన్ను శ్లాబులు 2016-17 ఆర్థిక సంవత్సరానికి 2015-16 ఆర్థిక సంవత్సరం లాగే కొనసాగించారు ఎలాంటి పెంపును ప్రతిపాదించలేరు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరం గణన లో తేది 01.04.2016 నుండి 31.03.2017 వరకు పొందిన జీతభత్యాలు ఆధాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.
2016 - 17 ఆర్థిక సంవత్సరం పన్ను శ్లాబు రేట్లు :
వయసు 60 సంవత్సరాలలోపు వారికి
2,50,000 వరకు - పన్ను లేదు
2,50,001-5,00,000 వరకు - 2.50 లక్షల పైబడిన ఆదాయం పైన 10%
5,00,001-10,00,000 వరకు -25,000/- + 5 లక్షల పైబడిన ఆదాయం పైన 20%
10,00,001 పైబడిన ఆదాయానికి - 1,25,000/- + 10 లక్షల పైబడిన ఆదాయం పైన 30%
వయసు 60 సంవత్సరాలు పైబడి 80 సంవత్సరాలలోపు వారికి
(1 ఏప్రిల్ 1937 తర్వాత - 1 ఏప్రిల్ 1957 కు ముందు పుట్టినవారు)
3,00,000 వరకు - పన్ను లేదు
3,00,001-5,00,000 వరకు - 3 లక్షల పైబడిన ఆదాయం పైన 10%
5,00,001-10,00,000 వరకు - 20,000/- + 5 లక్షల పైబడిన ఆదాయం పైన 20%
10,00,001 పైబడిన ఆదాయానికి -1,20,000/- + 10 లక్షల పైబడిన ఆదాయం పైన 30%
వయసు 80 సం|| పైబడిన వారికి (1 ఏప్రిల్ 1937 కు ముందు పుట్టినవారు)
5,00,000 వరకు - పన్ను లేదు
5,00,001-10,00,000 వరకు - 5 లక్షల పైబడిన ఆదాయం పైన 20%
10,00,001 పైబడిన ఆదాయానికి - 1,00,000/- + 10 లక్షల పైబడిన ఆదాయం పైన 30%
Section 87A ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 5లక్షల లోపు ఉన్నవారికి చెల్లించాల్సిన టాక్స్ లో రూ. 5,000/- రిబేట్ కలదు.
* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1) ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.
ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:-
Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.
ఆదాయముగా పరిగనించబడని అంశములు :-
పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.